TG వైద్యశాఖలో భారీగా ఉద్యోగాలు.!

వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,348 పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలియజేసింది.

TG వైద్యశాఖలో భారీగా ఉద్యోగాలు.!
X

న్యూస్ లైన్ డెస్క్: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,348 పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలియజేసింది. దీనికోసం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో మొత్తం 125 పోస్టులు భర్తీ చేయడానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీని ద్వారా మొత్తం ఫ్యామిలీ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ శాఖలో 575 ఉద్యోగాలు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో 11 ఉద్యోగాలు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిక్ మెడిసిన్ లో 34ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12వ తేదీన ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో ఉన్నటువంటి 26 ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్నటువంటి 4,356 పోస్టులను, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది.

Tags:
Next Story
Share it