Inter Supplementary: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే..

మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. మీరు సప్లమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నపుడు విద్యార్ధులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు

Inter Supplementary: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే..
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏపీలో( AP) ఇంటర్ ఫస్టియర్( INTER FIRST YEAR), సెకండియర్ ఫలితాలు (Inter Results) విడుదలయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు( INTER BOARD)0 కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. మీరు సప్లమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నపుడు విద్యార్ధులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. మార్కుల లిస్ట్ లో సప్లిమెంటరీ నా ..రెగ్యులర్ గా పాస్ అయ్యారా అనే విషయం సర్టిఫికేట్ లో మెన్షన్ చెయ్యరని తెలిపారు.

మార్కులపై ఏమైనా అనుమానాలు ఉంటే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి 24 వరకూ ఫీజు చెల్లించాలని సూచించారు. అనంతరం ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే, సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ కోసం విద్యార్థులు ఈ నెల 18 నుంచి 24 వరకూ ఫీజు చెల్లించాలని వివరించారు. మరిన్ని వివరాలు కావాలనుకుంటే అఫిషియల్ వెబ్ సైట్ లో ఉంటాయని తెలిపారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మార్చి 2 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.

Tags:
Next Story
Share it