Niab:పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే..!

ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. మరి ఆ వివరాలు ఏంటో

Niab:పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తెలంగాణ రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీలోని పశు సమర్ధక శాఖలో ఈ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా సమర్థక శాఖలో క్లర్కు సంబంధించి రెండు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు :

ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.

ఏజ్ లిమిట్:

ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారికి కనిష్టంగా 18 సంవత్సరాల నుంచి మొదలు 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు కూడా అభ్యర్థులకు వర్తిస్తాయి.

ఫీజు వివరాలు:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు.

శాలరీ వివరాలు:

ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు రూ:30వేల వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారిని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

చివరి తేదీ :

22-03-2023 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దీనికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ (niab) అనే ఆన్లైన్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Tags:
Next Story
Share it