Jobs:అటవీ శాఖలో ఉద్యోగాలు..అర్హత ఇదే..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో ఈ నోటిఫికేషన్ కాస్త ఊరటనిస్తోంది. ఇంతకీ అది ఏంటంటే

Jobs:అటవీ శాఖలో ఉద్యోగాలు..అర్హత ఇదే..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో ఈ నోటిఫికేషన్ కాస్త ఊరటనిస్తోంది. ఇంతకీ అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా మొత్తం 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు అర్హత, ఇతర వివరాలు చూద్దాం. ఆసక్తి కలిగి ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంప్యూటర్ రాత పరీక్ష ప్రొఫెషియన్సీ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు.

పోస్టుల సంఖ్య:37

విద్యార్హత:సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సవాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.అలాగే బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్,ఎలక్ట్రానిక్స్, మెకానికల్, పర్యావరణ శాస్త్రం, హార్టికల్చర్, జాగ్రఫీ, ఫిజిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ, వంటి సబ్జెక్టులు డిగ్రీలో కలిగి ఉండాలి. అలాగే శారీరక, వైద్య ప్రమాణాలు కూడా పరిగణలో ఉంటాయి.

వయస్సు:18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ప్రతి అభ్యర్థి రూ:250 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు తో పాటు, 120 పరీక్ష ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఎక్స్ సర్వీస్మెన్ వంటి వాళ్లకు 120 మినహాయింపు ఉంటుంది.

జీతం:రూ:48వేల నుంచి మొదలు 1,37,220 గా నిర్ణయించారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : ఏప్రిల్ 15, 2024. చివరి తేదీ మే 5,2024.

Tags:
Next Story
Share it