Jobs:రానున్న రోజుల్లో ఈ 5 రంగాల్లోనే ఉద్యోగాలు దొరుకుతాయట.!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రతి మనిషి అప్డేట్ అవుతున్నాడు. బాగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం సాధించాలనుకుంటున్నాడు. దీంతో దేశంలో

Jobs:రానున్న రోజుల్లో ఈ 5 రంగాల్లోనే ఉద్యోగాలు దొరుకుతాయట.!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రతి మనిషి అప్డేట్ అవుతున్నాడు. బాగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం సాధించాలనుకుంటున్నాడు. దీంతో దేశంలో చదువుకున్న వారు ఎక్కువయ్యారు ఉద్యోగాలు తక్కువయ్యాయి. దీన్నే నిరుద్యోగం అంటారు. మనదేశంలో పెరుగుతున్న టెక్నాలజీకి సంబంధించిన చదువు ఉండదు. ఒక 30 ఏళ్ల కింద ఉండే టెక్నాలజీకి సంబంధించిన చదువే ఇప్పటికీ కొనసాగుతుంది. అవే సబ్జెక్టులు ఇంకా ఇప్పటి విద్యార్థులు కూడా చదువుతున్నారు.

కానీ అన్ని దేశాల్లో అప్డేట్ అవుతు ఫ్యూచర్ కు, పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు వారి స్టడీస్ కూడా ఉంటున్నాయి. మనదేశంలో మాత్రమే టెక్నాలజీ దూసుకుపోతున్న, దానికి సంబంధించిన చదువు మాత్రం విద్యార్థులకు అందడం లేదు. చాలామంది ఫీజీలు, డిగ్రీలు పిహెచ్ డీలు చేసినా, టెక్నాలజీలో అనుభవం లేక చాలా వరకు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇంకా రానున్న కాలంలో మరింత టెక్నాలజీ పెరగనుంది. అలాంటి ఈ తరుణంలో ప్రస్తుతం పిల్లలను దానికి తగ్గట్టుగానే మనం చదివించి ప్రిపేర్ చేయించాలి. రాబోవు రోజుల్లో ఏ రంగంలో మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

#1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ :

ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ కలిగిన టెక్నాలజీలో అనుభవం ఉన్నవారికి ఫ్యూచర్ లో ఉద్యోగ డిమాండ్ ఎక్కువగా ఉంటుందట.

#2. డేటా సైన్స్:

డేటా సైన్స్ అండ్ అనాలటిక్స్ రంగాలలో నైపుణ్యమున్న వారికే ముందు ముందు రోజుల్లో అద్భుతమైన కెరియర్ ఉంటుందని టెక్ నిపుణులు అంటున్నారు.

#3. వైద్యరంగం:

ప్రస్తుతం మనం టెక్నాలజీలో ఎంత దూసుకుపోతున్నామో ఆరోగ్య విషయంలో కూడా అంతే వెనక్కి పోతున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి డాక్టర్లకు దానికి సంబంధించినటువంటి వర్క్ చేసే వారికి మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

#4. డిజిటల్ మార్కెటింగ్:

రాబోవు కాలంలో డిజిటల్ మీడియా రంగంలో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఫ్యూచర్ ఉంటుందట.

#5. సైబర్ సెక్యూరిటీ :

టెక్నాలజీ ఎంత పెరుగుతుందో సైబర్ నేరాలు అంతా పెరుగుతున్నాయి. సైబర్ నేరాల నుంచి రక్షించే ప్రొఫెషనల్ కు సంబంధించిన ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందట.

Tags:
Next Story
Share it