KVS Admission 2023 : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (KVS).. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసింది.

KVS Admission 2023 : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (KVS).. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.

సీట్ల రిజర్వేషన్‌: ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయించారు.

వయసు: 1వ తరగతిలో ప్రవేశం పొందాలంటే.. మార్చి 31 నాటికి విద్యార్థి వయసు 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రెండో తరగతి, మూడో తరగతిలో ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య.. నాలుగో తరగతికి 8-10, అయిదో తరగతికి 9-11, ఆరుకు 10-12, ఏడుకు 11-13, ఎనిమిదికి 12-14, తొమ్మిదికి 13-15, పదికి 14-16 ఏళ్ల మధ్య వయసుండాలి. ఈ వయసులు కంపల్సరీగా ఉండాల్సిందే. నెలలు, రోజులు తేడా వచ్చినా అప్లికేషన్ వాల్యుబుల్ కాదని తెలిపారు.

ఎంపిక విధానం: 8వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ( enterence exam) ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టమ్‌ ప్రకారం సీటు కేటాయిస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టమ్‌( lottery system) ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 10వ తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే ప్రవేశ పరీక్షల్లో ఫస్ట్ ప్రయారిటీ గ్రామీణ ప్రాంత పిల్లలకు మాత్రమే ఉంటుంది. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఎవరయితే...ఉంటారో వారికి అడ్మిషన్స్ లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

Tags:
Next Story
Share it