Railway Jobs: రైల్వేలో భారీగా పోలీసు జాబ్స్..!

ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలోనే 14వేల పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి

Railway Jobs: రైల్వేలో భారీగా పోలీసు జాబ్స్..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలోనే 14వేల పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి రైల్వే శాఖ మరోసారి చదువుకున్న యువకులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Rpf) భారీగా జాబ్స్ భర్తీ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 4660 జాబ్స్ ఉండగా ఇందులో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మొదలు మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు.

జాబ్స్ వివరాలు:

ఇందులో 452 ఎస్సై, 4208కానిస్టేబుల్స్.

అర్హత ప్రమాణాలు:

కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లై చేసే అటువంటి అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎస్సై ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పోలీసు జాబ్ కాబట్టి శరీరక ప్రమాణాలు తప్పనిసరి ఉండాల్సిందే.

వయస్సు:

కానిస్టేబుల్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క ఏజ్ 18 నుంచి 28 ఏళ్ళు ఉండాలి. ఎస్సై అభ్యర్థులకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.ఇది 2024 జూలై 1 నాటికి ఉండాలి.

ఎంపిక విధానం:

ఆన్లైన్లో రాత పరీక్ష అలాగే ఫిజికల్ ఎపిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్, పరీక్షలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు:

ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ట్రాన్స్ జెండర్, మహిళలు, మైనారిటీ, ఈబీసీ వారికి రూ:250. ఇతర అభ్యర్థులకు 500 రూపాయలు ఉంటుంది. పరీక్షలకు హాజరైతే 400 రిఫండ్ చేస్తారట.

జీతభత్యాలు:

కానిస్టేబుల్ జాబ్స్ ఎంపికైన వారికి రూ:21,700, ఎస్సై జాబుకు ఎంపికైన అభ్యర్థులకు రూ:35,400జీతం ఉంటుంది.

Tags:
Next Story
Share it