SEBI JOBS: సెబిలో ఉద్యోగాలు 90 వేల జీతం..!

సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు.

SEBI JOBS: సెబిలో ఉద్యోగాలు 90 వేల జీతం..!
X

న్యూస్ లైన్ డెస్క్: సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)లో గ్రేడిA అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయినటువంటి SEBI.GOV. IN అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 13, 2024.

పోస్టుల వివరాలు:

ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా జనరల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, లా విభాగం, రీసెర్చ్ విభాగం, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగాలలో మొత్తం 97 గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గరిష్ట వయస్సు మార్చి 31, 2024 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అంతా మూడు దశల్లో ఎంపిక చేయబడతారు. మొదట ఆన్లైన్ పరీక్ష. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. స్టెప్ వన్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ స్టెప్ 2 పరీక్షకు హాజరు అవుతారు. రెండు పేపర్ల ఆన్లైన్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

అన్ రిజర్వ్డ్ డ్ / ఈడబ్ల్యూఎస్ / ఓబిసి క్యాటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా 1000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ కేటగిరి అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి.

Tags:
Next Story
Share it