Telagana: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో (Telagana) ఈ మధ్యకాలంలోనే ఇంటర్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ఫలితాలు విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు

Telagana: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
X

Telagana: తెలంగాణ రాష్ట్రంలో (Telagana) ఈ మధ్యకాలంలోనే ఇంటర్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ఫలితాలు విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్లో ఫెయిల్ అయినందుకు గాను క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంటర్ విద్యార్థులు (Inter students). అయితే తాజాగా ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.

ఈ సంఘటన వరంగల్ జిల్లా (Warangal) కాశిబుగ్గలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కాశిబుగ్గకు చెందిన వరుణ్ సాయి (Varun Sai) అనే 17 సంవత్సరాల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.

ఇంటర్ ఫస్టియర్ లో మూడు సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు వరుణ్ సాయి. దీంతో మనోవేదనకు గురైన వరుణ్ సాయి.. ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఖిలా వరంగల్ కోటపై ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటర్ విద్యార్థి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు.

Tags:
Next Story
Share it