Fire accident: ఫార్మాలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

మరికొందరు కార్మికులు కంపెనీ లోపలే మంటల్లో చిక్కున్నట్లు సమాచారం.

Fire accident: ఫార్మాలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు
X

న్యూస్ లైన్ డెస్క్: రంగారెడ్డి జిల్లా నందిగామ(Nandigama) వద్ద ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆల్విన్‌ ఫార్మా(Alwin pharma) కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పలువురు కార్మికులు కిటికీల్లోంచి బయటకు దూకారు. కాగా, మరికొందరు కార్మికులు కంపెనీ లోపలే మంటల్లో చిక్కున్నట్లు సమాచారం. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదం చోటుచేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it