Akshaya Tritiya :అక్షయ తృతీయ..ప్రతి హిందువు చేసుకోవల్సిన పండుగ..ఎందుకు?

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా కచ్చితంగా విజయం లభిస్తుంది.

Akshaya Tritiya :అక్షయ తృతీయ..ప్రతి హిందువు చేసుకోవల్సిన పండుగ..ఎందుకు?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగకు చాలా ఇంపార్టెటంట్. మీకు ఇంకా చెప్పాలంటే అక్షయతృతీయ అంటే బంగారం కొనడం కాదు..అక్షయతృతీయ అంటే ఎన్నో వేల పుణ్యాలను మూటగట్టుకునే అవకాశం. అసలు ఈ బంగారం కొనడం అనే కాన్సప్ట్ ఎక్కడ పురాణాల్లో లేదు. ఇంకా చెప్పాలంటే అక్షయతృతీయ దానాలు చేయాలని మన పురాణాలు చెప్తున్నాయి.

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా కచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం శ్రీ క్రిష్ణుడు యుధిష్టరుడు అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించాడు.

* ఈ పర్వదినానే ఛార్‌ధామ్‌లోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు తెరవబడతాయి. ఈరోజు నుంచే భక్తులకు దర్శనభాగ్యం కలుగుతుంది.

*అక్షయ తృతీయ( akshaya tritiya) వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీనదిలోని సాలగ్రామాల( saligramala) గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి( vaishaka sudda thithiya) నాడు ఆవిర్భవించింది.

*అక్షయ తృతీయ రోజున ‘హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన’ అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీనర్థం విష్ణువు ( lord vishnu) అంటే హిరణ్యగర్భుడు. తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. అందుకే విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున పండుగను జరుపుకుంటారు.

* హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ( akshya tritiya) రోజునే పరశురాముడు( parasaramudu), హయగ్రీవుడు( hayagreva), నర నారాయణుడు( nara narayana) జన్మించారు.

* అక్షయ తృతీయ( akshaya tritiya) వంటి పవిత్రమైన రోజున బ్రహ్మ ( brahma)దేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. క్షయం అంటే తరగనిది అని అర్థం.

* అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించబడింది. అసలు హిరణ్యగర్భుని ( hiranya garba) పూజలు చేయండి అని చెప్పంది హిందు పురాణాల్లో ...ఇందులో ఈ బంగారం కొనడం అనే కాన్సప్ట్ ఎక్కడా లేదు..మీకు మరి సందేహం ఉంటే...ఓ ఉప్పు పాకెట్ తెచ్చి పెట్టుకొండి. ఇది కూడా చాలా మంచిది.

Tags:
Next Story
Share it