Kedarnath Dham: తెరుచుకునున్న కేదార్‌నాథ్‌ ఆలయం

వైశాఖ మాసం అక్షయతృతీయ రోజు ఈ ఆలయాన్ని తెరవడం ఎన్నో యేళ్ల నుంచి వస్తున్న ఆచారం. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు.

Kedarnath Dham: తెరుచుకునున్న కేదార్‌నాథ్‌ ఆలయం
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని( uttarakhand) ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌ నాథ్‌ ఆలయం శుక్ర‌వారం( friday) ఉద‌యం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. వైశాఖ మాసం అక్షయతృతీయ( akshaya tritiya) రోజు ఈ ఆలయాన్ని తెరవడం ఎన్నో యేళ్ల నుంచి వస్తున్న ఆచారం. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు.

పరమేశ్వరుడి( maha shiva) పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌( kedharnath) ఆలయం ఒకటి. చార్‌ధామ్‌( chardham) యాత్రలో కేదార్ నాథ్‌( kedharnath) దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం...దాదాపు కొన్ని లక్షల మంది స్వామి వారి దర్శనానికి యావత్ భారతదేశం నలుమూలల నుంచి వస్తుంటారు. ఈ 6 నెలలు దర్శనాలతో కేథార్ నాథ్ కనకవైకుంఠంగా ఉంటుంది. మిగిలిన ఆరునెలలు శీతాకాలం వలన మూసి ఉంచుతారు.

సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టారు. మరోవైపు యమునోత్రి( yamundothri)ఆలయం కుండా ఉదయం 7 గంటలకే తెరుచుకుంది. గంగోత్రి ( gangothri) ఆలయం మాత్రం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుచుకోనుంది. ఇక చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రీనాథ్‌( badrinath) ఆలయాన్ని ఈ నెల 12న తెరుచుకుంటుంది. అక్షయతృతీయ రోజు విష్ణు ఆరాధన చాలా మంచిది. ఈ రోజు ఏ పని చేసినా దాని కంటే వంద రెట్లు పుణ్యఫలం దక్కుతుందని పురాణాల ప్రతీతి.



Tags:
Next Story
Share it