ONTIMITTA: వేణుగానాలంకారంలో ఒంటిమిట్ట కోదండరాముడు

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తిని( SREE RAMA CHANDRAMURTHY) అలంకరించారు.

ONTIMITTA: వేణుగానాలంకారంలో ఒంటిమిట్ట కోదండరాముడు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి( ONTIMITTA KODANDA RAMUDU) బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తిని( SREE RAMA CHANDRAMURTHY) అలంకరించారు. స్వామివారు వేణువు ( VENUVU) ధరించి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. చెక్కభజన, కోలాటం, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా ఊరేగింపు జరిగింది. యాత్రికులు అడుగడుగునా కర్పూరహారతులు అందించారు.

ఓంటిమిట్ట దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం..ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలకు వాహనసేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, సూపరింటెండెంట్లు హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ పాల్గొన్నారు.

స్వామి వారి కళ్యాణ బ్రహ్మాత్సవాలు ( BRAMOSTHAVALU) తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు దేవాలయానికి చేరుకున్నారు. స్వామి వారికి కన్నులపండుగగా ..అలంకరణ ..ఉత్సవాలు ...సేవలు అందిస్తున్నారు. శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమాన్ కు ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు శ్రీరామ జపంతో ఒంటిమిట్ట దద్దరిల్లుతుంది.

Tags:
Next Story
Share it