Rashi Phalalu: ఇవాళ్టి రాశి ఫలాలు.. పాత బాకీలు వసూలు, దైవ దర్శనాలు

మేషం ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలలో

Rashi Phalalu:  ఇవాళ్టి రాశి ఫలాలు.. పాత బాకీలు వసూలు, దైవ దర్శనాలు
X

మేషం

ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలలో లాభాలను పొందుతారు. సంతోషంగా ఉంటారు.

వృషభం

ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు చేసే ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు వెళ్తారు. వాహనాలను నడిపే సమయంలో జాగ్రత్త పాటించాలి. కుటుంబసభ్యుల సలహాలు, సూచనలు పాటించాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

మిథునం

స్త్రీలు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.

కర్కాటకం

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు, పెరిగిన ధరలు కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. వ్యాపారాలలో లాభాలను పొందుతారు. నోటీసులు, రసీదులు చేతికి అందుతాయి.

సింహం

గృహంలో మార్పులు జరుగుతాయి. సన్నిహితుల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. మీ పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పాటించాలి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి ఏర్పడుతుంది.

కన్య

కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడంతో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దూర ప్రయాణాలు కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. వాహనం నడిపే సమయంలో ఏకాగ్రత పాటించాలి. అనుకున్న పనులు పూర్తవుతాయి.

తుల

సోదరీ, సోదరుల మధ్య గొడవలు తొలగిపోతాయి. కొత్తగా చేపట్టిన పనులలో కాస్త శ్రమించాల్సి ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

వృశ్చికం

మీడియా రంగాల వారికి కాస్త ఇబ్బందులు, చికాకులు ఎదురవుతాయి. కొంత అసౌకర్యానికి లోనవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. భాగస్వాముల మధ్య ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనుస్సు

ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు వ్యవహారాలలో మెలకువ అవసరం. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది.

మకరం

అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇతరుల నుంచి ఏమి ఆశించకపోవడం మంచిది. వ్యాపార రంగాల్లో పురోభివృద్ధి కానవస్తుంది. Bమీ మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.

కుంభం

వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత పాటించాలి. నూతన గృహం కొనుగోలు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కలల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులు ఏర్పడుతాయి.

మీనం

బ్యాంకులు లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మొండి బాకీలు వసూలు అవుతాయి.

Tags:
Next Story
Share it