Rashi Phalalu: ఇవాళ్టి రాశి ఫలాలు..ఇంట్లో పూజలు, ధన లాభం

మేషం ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఇంట్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది

Rashi Phalalu: ఇవాళ్టి రాశి ఫలాలు..ఇంట్లో పూజలు, ధన లాభం
X

మేషం

ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఇంట్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. కావాల్సిన వారి నుంచి అన్ని విధాలా సహకారం లభిస్తుంది.

వృషభం

దైవదర్శనాలు చేసుకుంటారు. ఉపాధ్యాయులకు బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత అవసరం.

మిథునం

ఇతరుల నుంచి సమాచారం సేకరిస్తారు. స్త్రీల ఆరోగ్య విషయంలో సంతృప్తి ఉంటుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

కర్కాటకం

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పని పట్ల ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో సంతృప్తి ఉంటుంది. వ్యాపారస్తులకు సంపద పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సింహం

మీ జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. ఇంట్లో మార్పులు జరుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడి చికాకులు అధికమవుతాయి.

కన్య

ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అనారోగ్యం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే ఆస్కారం ఉంటుంది.

తుల

రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు అవకాశాలు లభిస్తాయి. కొంత పురోగతి కనిపిస్తుంది. మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

వృశ్చికం

పరిచయాలు అధికమవుతాయి. చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది.

ధనుస్సు

స్త్రీలకు అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. గృహంలో ప్రశాంతత ఉంటుంది. ఎదుటివారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం.

మకరం

మీ సంతానం మీకు ఎంతో చికాకును కలిగిస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది. స్థిరాస్తి అమ్మకం పట్ల ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. బంధువుల రాకతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

కుంభం

కాంట్రాక్టర్లకు చికాకులు ఎదురవుతాయి. పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విపరీతమైన ఖర్చులు ఏర్పడతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మారుతారు.

మీనం

ప్రింటింగ్ రంగాల వారికి వసూళ్ల విషయంలో శ్రమ ఏర్పడుతుంది. తలపెట్టిన కార్యక్రమాలు చురుగ్గా సాగుతాయి. వ్యాపారులు కొనుగోలుదారులతో కాస్త సమస్యలు ఎదుర్కొంటారు.

Tags:
Next Story
Share it