Rashi Phalau: ఇవాళ్టి రాశి ఫలాలు..దైవ దర్శనాలు, ధన లాభం

మేషం సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం ఏర్పడుతుంది

Rashi Phalau: ఇవాళ్టి రాశి ఫలాలు..దైవ దర్శనాలు, ధన లాభం
X

మేషం

సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం ఏర్పడుతుంది. సోదరీ సోదరుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి ఉంటుంది.

వృషభం

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది.

మిథునం

పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. పెంపుడు జంతువులపై జాగ్రత్త మంచిది. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది.

కర్కాటకం

స్త్రీలకు ప్రోత్సాహం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రైవేట్ సంస్థలలోని వారికి లాభాలు ఉంటాయి.

సింహం

ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంటుంది. సొంత వ్యాపారాలలో ప్రగతి ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి.

కన్య

శత్రువులు మిత్రులుగా మారే సమయం దగ్గరలోనే ఉంటుంది. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలు పాటించడం మంచిది.

తుల

ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి అధికం అవుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు విలాసాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి.

వృశ్చికం

పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. సంతోషంగా కాలక్షేపం చేస్తారు ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు

ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి.

మకరం

వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకు కాస్త ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు శ్రమ పని ఎక్కువ అవుతాయి.

కుంభం

బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి శుభదాయకంగా ఉంటుంది. క్యాటరింగ్ వారికి పురోభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడం మంచిది.

మీనం

వృత్తి ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. రియల్ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి.

Tags:
Next Story
Share it