Simhachalam: ఘనంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

సాధారణంగా కొన్ని క్షేత్రాలలో నృసింహస్వామి ( NRUSIMHA SWAMI) .. కొన్ని క్షేత్రాలలో వరాహస్వామి కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు

Simhachalam: ఘనంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సాధారణంగా కొన్ని క్షేత్రాలలో నృసింహస్వామి ( NRUSIMHA SWAMI) .. కొన్ని క్షేత్రాలలో వరాహస్వామి కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ రెండు అవతారమూర్తులు ఒక్కటిగా ఏర్పడిన దైవమే సింహాద్రి అప్పన్న. స్వామి వారిని శాంత పరచడానికి...ఈ గంధాన్ని నాలుగు విడతలుగా స్వామివారికి లేపనం వేస్తారు.

ప్రతి ఏడాది 'వైశాఖ శుద్ధ తదియ'( VAISHAKA SUDDHA THATHIYA) రోజున చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి మూర్తిపై ఉన్న 12 మణుగుల చందనాన్ని( SANDEL POWDER) ఒలిచి .. నిజరూపాన్ని తిలకించడానికి భక్తులకు అనుమతినిస్తారు. పొద్దున్నే స్వామి వారి సుప్రభాత సేవ అయిపోగానే...స్వామివారిపై ఉన్న చందనాన్ని చాలా సున్నితంగా ఒలుస్తారు. అశోక్ గజపతి రాజు తొలి పూజ చేయించారు.

స్వామివారి నిజరూప ( NIJA ROOPA DARSHANAM) దర్శనానికి కేవలం 12 గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. అందువలన ఆ స్వామిని దర్శించుకోవడానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తండోప తండాలుగా ఈ క్షేత్రానికి తరలివచ్చారు. 'అప్పన్నా'( APPANNA) అని భక్తులు ఆప్యాయంగా పిలవడం 'సింహగిరి'( SIMHAGIRI) పై మారుమ్రోగింది. స్వామివారి స్వయంభూ మూర్తి నుంచి ఒలిచిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆ నిజరూప దర్శనం అనంతరం 3 మణుగుల చందనాన్ని అద్దుతారు.

Tags:
Next Story
Share it