Vasthu: ఇల్లు మారేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే దరిద్రమే..!

చాలామంది పాత ఇంటి నుంచి కొత్త ఇంటి కి వెళ్లేటప్పుడు కొన్ని ఏర్పాట్లు అయితే ప్రత్యేకంగా చేసుకుంటారు. అలాంటి వారు ఇల్లు మారే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్త

Vasthu: ఇల్లు మారేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే దరిద్రమే..!
X

న్యూస్ లైన్ డెస్క్: చాలామంది పాత ఇంటి నుంచి కొత్త ఇంటి(New House) కి వెళ్లేటప్పుడు కొన్ని ఏర్పాట్లు అయితే ప్రత్యేకంగా చేసుకుంటారు. అలాంటి వారు ఇల్లు మారే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలట. లేకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండకుండా పోతుందని దానివల్ల దరిద్రం తాండవిస్తుందని పండితులు అంటున్నారు. ఇల్లు మారి కొత్తగా వెళ్లిన ఇంట్లో ఆగ్నేయంలో ఎర్రటి ప్లాస్టిక్ పూలు తప్పనిసరిగా ఉంచాలట. అంతేకాకుండా వాయువ్యంలో తెల్లటి పూలను ఉంచాలట.

నైరుతిలో పసుపు పచ్చని ప్లాస్టిక్ పూలు, ఈశాన్యంలో రాగి చెంబు తీసుకొని నీళ్లు పోసి ముత్యాల దండ అందులో వేయాలట. ముఖ్యంగా కొత్త ఇంట్లోకి మీరు మారినప్పుడు ఆ ఇంట్లో ఆదివారం పూట ఒక టమోటా, కాస్త ఉప్పు తీసుకుని తప్పనిసరిగా దిష్టి తీయాలట. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ (Nagative energy) పోయి, పాజిటివ్ ఎనర్జీ వచ్చి కలిసి వస్తుందట. మీరు వెళ్లిన కొత్త ఇంట్లో హ్యాపీగా నిద్రపోతే ఎలాంటి దోషాలు లేనట్టు, ఒకవేళ ఆ ఇంట్లో మీకు నిద్ర పట్టకుండా చికాకుగా ఉంటే దోషాలు ఉన్నట్టు గమనించాలి. ముఖ్యంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ముందుగా పాలు, ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం ఇలా మనకు అవసరమైన వంట సామాగ్రిని ముందుగా తీసుకెళ్లాలట. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుందట. ఇక కొత్త ఇంట్లోకి పాత ఇంట్లో(Old home) ని చీపిరి అసలు తీసుకెళ్లకూడదట.

అలాగే పాత చెప్పులు కూడా కొత్త ఇంట్లోకి తీసుకెళ్లకూడదట. అంతేకాకుండా రోలు, రోకలి కొత్త ఇంట్లోకి తెచ్చుకొని సరైన ప్లేసులో అమర్చాలట, అవి శివపార్వతులకు సాంకేతం అని పండితులు అంటున్నారు. ఈ విధంగా నియమాలు పాటిస్తూ ఇల్లు మారితే లక్ష్మీ (Lakshmi) కటాక్షం కలిగి ధనం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బుధ, గురు, శుక్రవారాల్లో, తప్పనిసరిగా మారాలి. ఎట్టి పరిస్థితుల్లో సోమ మంగళవారాల్లో ఇల్లు మారకూడదట. ముఖ్యంగా కొత్త ఇంటికి వెళ్లగానే ఆ ఇంటికి ఒక రావి కొమ్మ, వేప కొమ్మ కలిపి కట్టాలట. దీనివల్ల ఆ ఇంట్లో సంపూర్ణ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన ప్రాప్తి లభిస్తుందని పండితుడు తెలియజేస్తున్నారు.

Tags:
Next Story
Share it