Mumps:గవదబిళ్లల సమస్య వేధిస్తోందా.ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.?

ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లల్లో గవద బిళ్ళలు రావడం చూస్తున్నాం. ఈ సమస్య అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అవుతోంది. ఈ వ్యాధి బారిన చాలామంది పిల్లలు పడుతూ ఇ

Mumps:గవదబిళ్లల సమస్య వేధిస్తోందా.ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.?
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లల్లో గవద బిళ్ళలు రావడం చూస్తున్నాం. ఈ సమస్య అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అవుతోంది. ఈ వ్యాధి బారిన చాలామంది పిల్లలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ గవదబిళ్ళల సమస్య ఎందుకు వస్తుంది. ఈ వ్యాధి బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం. ఈ వ్యాధి బారిన పిల్లల బుగ్గలు బూరెల్లా ఉబ్బుతాయి. అంతేకాకుండా దవడ భాగంలో విపరీతంగా నొప్పి ఉంటుంది. దీనివల్ల పిల్లలకు తినడానికి కానీ, తాగటానికి కానీ సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా జ్వరం, దగ్గు విపరీతంగా ఉంటుందట..

ఎలా వస్తుంది:

ఈ గవదబిళ్ళల సమస్య అనేది పరా మైక్సో వైరస్ వల్ల వస్తుందట. ఈ వైరస్ ముఖ్యంగా లాలాజల గ్రంధులను ప్రభావితం చేస్తుందని, దీనివల్ల పరోటిడ్ గ్రంధులు ఏర్పడి లాలాజలాన్ని తయారు చేస్తాయట. దీనివల్ల బుగ్గలు ఉబ్బి గొంతులో నొప్పి ఏర్పడుతుంది. ఇది ఏ వయసులో ఉన్న వారికైనా వస్తుంది కానీ పిల్లలకు అధికంగా వ్యాపిస్తుంది.

లక్షణాలు:

ఆకలి లేకపోవడం

కండరాల నొప్పి

తలనొప్పి.

జ్వరం, అలసట.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం బయట ఫుడ్ తినడం. అంతేకాకుండా ఈ వ్యాధి సోకిన వ్యక్తులు వాడిన పాత్రలు లేదంటే నీరు షేర్ చేసుకోవడం వల్ల వస్తుందట. ఈ సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ కు చూపించుకుని వ్యాక్సిన్ తీసుకోవాలట.

Tags:
Next Story
Share it