Ayurvedam Tips: చక్కని నిద్రకు ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివే

రాత్రంతా అస్సలు నిద్రపట్టలేదు.. అనేది ఈరోజుల్లో చాలా మంది నోటి నుంచి వినిపించే మాట ఇది. రాత్రిపూట తగినంత నిద్రలేకపోతే తెల్లారి అలసటగా అనిపిస్తుంది.

Ayurvedam Tips: చక్కని నిద్రకు ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివే
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాత్రంతా అస్సలు నిద్రపట్టలేదు.. అనేది ఈరోజుల్లో చాలా మంది నోటి నుంచి వినిపించే మాట ఇది. రాత్రిపూట తగినంత నిద్రలేకపోతే తెల్లారి అలసటగా అనిపిస్తుంది. అంతేనా సగం మానసిక సమస్యలకు ఈ నిద్రలేమి( SLEEPLESS NESS) మొదటి కారణం. ఇది ఆరోగ్యానికి అంతగా ప్రయోజనాలు అందించకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. అయితే నిద్రకు ఆయుర్వేదం చెప్పిన కొన్ని చిట్కాలు చూద్దాం.

అశ్వగంధ టీ

ఆయుర్వేదంలో( AYURVEDHA) అశ్వగంధకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో అశ్వగంధ( ASHWAGANDHA) మేలైన ప్రయోజనాలు అందిస్తుంది. ఎంత స్ట్రెస్ లో ఉన్నా...మంచి రిలాక్షేషన్ హార్మోన్స్ ను రిలీజ్ చేస్తుంది. ఈ హెర్బ్ కు ఆయుర్వేదంలో చాలా మంచి పేరుంది. ఈ టీ ని ఓ సారి ట్రై చెయ్యండి. సేమ్ మీరు నార్మల్ టీ లో టీ పౌడర్ ఎలా వేస్తారో అలానే ఈ టీ కూడా . కాస్త పంచదార బదులు తేనె వేసుకొండి.

వెచ్చని నీరు, నెయ్యి

నెయ్యి ( GHEE) అనేక పోషక గుణాలు కలిగి ఉంది. ఒక టీ స్పూన్ నెయ్యిని గోరు వెచ్చని ( LUKE WARMWATER) నీటిలో కలుపుకుని నిద్రవేళకు ముందు తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్రని ప్రేరేపిస్తుంది.

కుంకుమ పువ్వు, యాలకుల పాలు

గోరు వెచ్చని పలు/ నీటిలో కొన్ని కుంకుమ పువ్వు( KUKUMA PUVVU), చిటికెడు యాలకుల పొడిని ( ILACHI POWDER) కలుపుని తాగొచ్చు. ఇది విశ్రాంతిని ఇస్తుంది. ఇది కూడా మీ హార్మోన్స్ ను కూల్ చేస్తుంది. ఫోన్ పట్టుకోకపోతే ..మీరు జస్ట్ పదినిమిషాల్లో పడుకుంటారు.

వలెరియన్ రూట్ టీ

వలెరియన్ రూట్( VALERIAN ROUTE) శతాబ్దాలుగా నిద్రలేమి, ఆందోళన తగ్గించేందుకు సహజ నివారణగా ఉపయోగించబడుతుంది. అయితే నిద్ర లో చాలా రకాలుంటాయి..క్వాలిటీ ఆఫ్ స్లీప్ ...చాలా డీప్ గా నిద్రపోవడం ...ఏ శబ్దానికైనా రెస్పాండ్ అయ్యేంత డిస్టర్బ్ నిద్ర...అయితే ప్రశాంతమైన నిద్ర రోజు కు నాలుగు గంటలైనా చాలు..కాబట్టి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చెయ్యండి. నిద్ర ఎందుకు పట్టదో చూద్దాం.

Tags:
Next Story
Share it