Eye care tips: వేసవి వేడి కి మీ కళ్లు జాగ్రత్త

తీవ్రమైన ఎండ ( SUMMER) నేరుగా చర్మంతో పాటు కంటిమీద కూడా ప్రభావం చూపిస్తుంది. వేసవి లో చర్మం అంతా ఒక ఎత్తు అయితే కళ్లు మాత్రం మరో ఎత్తు. అత్యంత సున్నితమైనవి.

Eye care tips: వేసవి వేడి కి మీ కళ్లు జాగ్రత్త
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తీవ్రమైన ఎండ ( SUMMER) నేరుగా చర్మంతో పాటు కంటిమీద కూడా ప్రభావం చూపిస్తుంది. వేసవి లో చర్మం అంతా ఒక ఎత్తు అయితే కళ్లు మాత్రం మరో ఎత్తు. అత్యంత సున్నితమైనవి.

వేసవిలో యూవీ కిరణాల ( UV RAY)ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కార్నియ( CARNIA)కు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఈ ఎండ వేడి...ఇంత యూవీ లైటింగ్( UV LIGHTING) చూడ్డం వల్ల కళ్లు పోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. వేసవిలో వీచే గాలుల్లో పుప్పొడి వంటి అలర్జీకి కారణమయ్యే కణాలు ఎక్కువగా ఉండవచ్చు. వీటి వల్ల కంటిలో దురదలు( EYES ITCHING) రావచ్చు. కళ్లు ఎర్రబారడం, కళ్ల నుంచి నీరు రావడం ( EYES FULL FOR WATER)వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏసీల్లో ( AC)గడపడం వల్ల కళ్లు పొడిబారే సమస్య రావచ్చు. కళ్లకు తగినంత తేమ లేనపుడు కళ్లలో అసౌకర్యంగా ఉండడం, ఎర్రబారడం, కళ్లు గరగరలాడడం లాంటివి జరుగుతాయి. ఈ కారణంగానే ఎక్కువ శాతం కంటి ఆపరేషన్లు ఈ ఎండాకాలంలో జరుగుతూ ఉంటాయి.

కంటి మీద నేరుగా ఎండ ( SUNLIGHT)పడకుండా కంటికి నీడనిచ్చే టోపీలు ధరించాలి. అంతేకాదు సన్ గ్లాసెస్ కూడా పెట్టుకొండి.

ఆకు కూరలు( GREEN VEGTABLES), చేపలు( FISH) కంటి ఆరోగ్యానికి పెంచుతాయి.కళ్లు దురదగా ఉంటే చేతితో రుద్ద కూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. కంటిలో గాయాలకు కూడా కారణం కావచ్చు. కళ్లకు ఇబ్బంది లేకుండా రసాయనల బారిన పడకుండా ఉండేందుకు క్లొరినేటెడ్ స్విమ్మింగ్ ఫూల్ లో గాగుల్స్ ధరించకుండా దిగవద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలకు పూల్ కి తీసుకెళ్తే ...చెవుల్లోకి నీళ్లు వెళ్లకుండా ...కంట్లోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొండి.

Tags:
Next Story
Share it