Heart Attack: గుండెనొప్పి వచ్చే ముందు ఈ భాగాల్లో నొప్పి వస్తుందట..!

ప్రస్తుత కాలంలో హార్ట్ ఎటాక్స్ అనేవి ఎక్కువైపోయాయి. వయసు తో తేడా లేకుండా ఎవరికి పడితే వారికే గుండె నొప్పులు వస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటనేది ఎవరికి అంతు

Heart Attack: గుండెనొప్పి వచ్చే ముందు ఈ భాగాల్లో నొప్పి వస్తుందట..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో హార్ట్ ఎటాక్స్ అనేవి ఎక్కువైపోయాయి. వయసు తో తేడా లేకుండా ఎవరికి పడితే వారికే గుండె నొప్పులు వస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. మరి సాధారణంగా గుండె నొప్పి వచ్చే ముందు మన శరీర భాగాల్లో ఎక్కడెక్కడ నొప్పి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా గుండెనొప్పి వచ్చే ముందు శరీరం యొక్క పై భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రధానమైనది వీపునొప్పి. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ముందుగా వీపులో విపరీతమైన నొప్పి పుడుతుందట. అలాగని ఏ నొప్పైనా గుండె నొప్పులు అనుకోకూడదు. ఆ నొప్పి కాస్త వెరైటీగా ఉంటుందట. అలాంటి సమయంలో నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ వద్దకు వెళ్లాలట. అలాగే మరోనొప్పి చాతినొప్పి. గుండె నొప్పి వచ్చే ముందు ఛాతిలో ఎక్కువగా నొప్పి వస్తుందట. చాతినొప్పి వచ్చినప్పుడల్లా గుండె పోటు వస్తుందని భావించకూడదు.

ఎసిడిటీ వల్ల కూడా గుండెలో నొప్పి ఏర్పడుతుంది. అలాగే జబ్బల భాగంలో కూడా నొప్పి పుడుతుందట . ఈ నొప్పి భరించ లేకుండా ఉంటుందట. అంతే కాకుండా మెడనొప్పి కూడా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మనకు ప్రధానంగా వచ్చే నొప్పుల్లో ఒకటని అంటున్నారు. ఈ విధంగా గుండెపోటు వచ్చే ముందు ఇలాంటి నొప్పులు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:
Next Story
Share it