Heart attack:గుండెపోట్లు బాత్రూంల్లోనే ఎక్కువగా వస్తాయి.. కారణమిదేనా.?

ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దీనికి వయసుతో తేడా అస్సలు ఉండడం లేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య చాలా మందిని

Heart attack:గుండెపోట్లు బాత్రూంల్లోనే ఎక్కువగా వస్తాయి.. కారణమిదేనా.?
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దీనికి వయసుతో తేడా అస్సలు ఉండడం లేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య చాలా మందిని వేధిస్తోంది. దీనికి కారణం ఏంటనేది క్లియర్ గా తెలియదు కానీ మనం ఇప్పటివరకు చూసినా చాలా గుండెపోటు మరణాల్లో ఎక్కువ మంది బాత్రూంలోనే మరణించడం చూస్తున్నాం. ఇలా బాత్రూంలోనే గుండెపోటు ఎక్కువగా ఎందుకు వస్తుంది. దీనికి కారణం ఏంటి అని వివరాలు తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో మన జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఫుడ్ విషయంలో ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎక్కువగా చైనీస్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ తింటూ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాలను పెంచుకుంటున్నారు. దీనివల్ల చాలామంది గుండెపోటు బారిన పడుతున్నారు. ఈ గుండెపోట్లు అనేవి ఎక్కువగా బాత్రూంలోనే సంభవించడం మనం చూస్తున్నాం. దీనిపై రీసెర్చ్ చేసిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం 11% శాతం కంటే ఎక్కువ మంది గుండెపోట్లు బాత్రూంలోనే సంభవించాయట.

అయితే బాత్రూంలో కూర్చున్న సమయంలో మూత్ర విసర్జన చేస్తారట.ఈ టైంలో కొంతమంది ఎక్కువగా శక్తిని ఉపయోగిస్తారట. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు తగ్గడానికి కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. వీటి కారణంగా మెదడుకు రక్తప్రసరణ తగ్గి మనిషి ఆపస్మారక స్థితిలోకి వెళ్తారట. అయితే వారు బాత్రూం డోర్స్ వేసుకుంటారు కాబట్టి వారిని ఎవరూ పట్టించుకోరు. అలా బాత్రూంలో గుండెపోటు గురై చనిపోతూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది స్నానం చేసే సమయంలో కూడా గుండెపోట్లు వస్తూ ఉంటాయి.

ఎక్కువగా చల్లని నీరు లేదంటే అధిక వేడి నీటితో స్నానం చేయడం వల్ల హృదయ స్పందన రేటు ప్రభావితమవుతుందని తెలుస్తోంది. దీనివల్ల శరీరంలోని రక్తమంతా మెదడుకు ఒకేసారి చేరుతుంది. ఇలా రక్తనాళాల్లో ఉధృక్తత పెరగడం గుండెపోటు వస్తుందట. కాబట్టి ఈ సమయంలో సడన్ గా తలపై నీరు పోయకుండా కాళ్ల భాగం నుంచి మెల్లిమెల్లిగా నీళ్లు బాడీపై పోసుకోవాలట. అంతేకాకుండా బీపీ, షుగర్ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎక్కువగా బాత్రూం డోర్స్ వేయకుండానే స్నానం చేయడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:
Next Story
Share it