Thati Munjalu: తాటి ముంజలు వచ్చేశాయ్..టేస్టీ టేస్టీ ఐస్ యాపిల్ ICE

ఈ తాటిముంజులకు క్యూ కడతారు.వీటిని కన్నడలో 'తాటి నుంగు' nungu) అని.. తమిళంలో 'నుంగు' అని అంటారు. అసలు లేలేత ముంజులు..కాసింత చక్కెర వేసుకొని తింటే మామూలుగా ఉండదు.

Thati Munjalu: తాటి ముంజలు వచ్చేశాయ్..టేస్టీ టేస్టీ ఐస్ యాపిల్ ICE
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తాటిముంజలు( ICE APPLE) తాటిచెట్లనుంచి కాయల నుంచి లభిస్తున్నాయి. తాటి ముంజలు మన భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లభిస్తాయి. చలికాలం పూత మొదలయ్యి ..ఎండాకాలంలో( SUMMER) పూస్తాయి. ఎండలకాలం రాగానే..సౌత్ లో చాలా వరకు ఈ తాటిముంజులకు క్యూ కడతారు.వీటిని కన్నడలో 'తాటి నుంగు' nungu) అని.. తమిళంలో 'నుంగు' అని అంటారు. అసలు లేలేత ముంజులు..కాసింత చక్కెర వేసుకొని తింటే మామూలుగా ఉండదు.

ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన ఎనర్జీ ఉంటాయి. అందుకే వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా మంచిది. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై( face pack) , శరీరంపై చెమటకాలు వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే... వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి( vitamin B ) , ఐరన్( IRON) , క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.

గర్భిణీలకు( PREGNENT) కొంత మందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. . కలిగే మలబధ్ధకం ..వేడి చేయడం లాంటి గుణాలను టక్కున క్లియర్ చేస్తుంది. అంతేకాదండోయ్..రోజు ఈ ముంజులు తింటే శరీరంలో ఉన్న చెడు కొవ్వును తరిమికొట్టొచ్చు. అంతేకాదు..తాటిముంజలు దాదాపు జీరో క్యాలరీలు...స్కిన్ కు నేచురల్ క్లెన్సర్ లా పనిచేస్తుంది. ముఖంపై ఉన్న మట్టి ...టాన్ పోగొడుతుంది. చెమట కాయలు రాకుండా చేస్తుంది. రోజు తింటే లివర్ ప్రాబ్లమ్సే ఉండవ్.

Tags:
Next Story
Share it