Oil: ఈ నూనె తలకు పట్టించారంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు..!

ప్రస్తుత కాలంలో చాలామందికి చిన్న వయసులోనే బట్టతల సమస్య వస్తోంది. దీంతో చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనిషికి అందమంటేనే వెంట్రుకలు అయితే తల వెంట్రుక

Oil: ఈ నూనె తలకు పట్టించారంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామందికి చిన్న వయసులోనే బట్టతల సమస్య వస్తోంది. దీంతో చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనిషికి అందమంటేనే వెంట్రుకలు(Hair).అయితే తల వెంట్రుకలు లేకపోతే వారిని ముసలి వాళ్ళలా భావిస్తూ ఉంటారు.

కొంతమందికి వంశపారంపర్యంగా బట్టతల వస్తే మరి కొంతమందికి ప్రస్తుత ఫుడ్ వల్ల బట్టతల సమస్యలు వస్తున్నాయి.పెళ్లి కాకముందు ఈ సమస్య ఏర్పడింది అంటే ఇక వారికి పెళ్లవ్వడం కష్టమే. మరి అలాంటి బట్టతల రాకుండా ఉండాలి అంటే ఈ నూనెను రాసుకోవాలట. అదేంటో ఇప్పుడు చూద్దాం.. మన ఇంట్లో ఉండేటువంటి కొబ్బరినూనె (Coconut oil) లేదంటే ఆవ నూనె 100ml తీసుకొని పొయ్యి మీద వేడి చేయాలి. ఆ నూనెలో చిన్నగా కోసినటువంటి ఉల్లిగడ్డ (Onion) ముక్కలను వేయాలి. అంతేకాకుండా కరివేపాకు ఆకులు, ఒక టీ స్పూన్ మెంతులు, కలోంజీ సీడ్స్ వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.

ఆ తర్వాత నూనె(Oil) ను చల్లార్చి వడకట్టి సీసాలో నిలువ చేసుకోవాలి. దీన్ని ఆడవారైనా మగవాళ్ళైనా జుట్టుకు రాసుకొని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ మసాజ్ వల్ల రక్తప్రసరణ పెరిగి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవు అవుతుందట. నూనె రాసిన గంట తర్వాత కుంకుడుకాయ తో స్నానం చేయాలి. ఈ విధంగా ఒక వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా చుండ్రు సమస్య కూడా పోయి జుట్టు ఒత్తు(Thick Hair) గా తయారవుతుందని అంటున్నారు.

Tags:
Next Story
Share it