DRINKS: ఇదిగో కుర్రాళ్లు...కూల్ డ్రింకులు కాదు...ఇవి తాగండి

కూల్ డ్రింక్స్ కలర్చ్ పెరిగింది వారంలో రెండు సార్లైనా కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. అసలు ఎండాకాలమే రావాల్సిన అవసరం లేదు. కూల్ డ్రింక్స్ లేనిదే వీక్ ఎండ్ అవ్వదు.

DRINKS: ఇదిగో కుర్రాళ్లు...కూల్ డ్రింకులు కాదు...ఇవి తాగండి
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కూల్ డ్రింక్స్( COOL DRINKS) కల్చర్ పెరిగింది వారంలో రెండు సార్లైనా ...కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. అసలు ఎండాకాలమే ( SUMMER)రావాల్సిన అవసరం లేదు. కూల్ డ్రింక్స్ లేనిదే వీక్ ఎండ్ అవ్వదు.అలా అయిపోయింది ప్రపంచం. కాని గుర్తుంచుకొండి.. ఆరోగ్యం చాలా విలువైంది. కూల్ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ రావడం ఖాయం . ఇది అందరికి తెలిసిన విషయమే.

* కూల్ డ్రింక్స్ కాకుండా ఇంకా చాలా డ్రింక్స్ ఉన్నాయి. అసలు సరిగ్గా రుచులు చూడాలి కాని భారత్ లో దొరకనవా...కూల్ డ్రింక్ ఆల్ట్రనేటివ్ ...డ్రింక్స్ చాలా ఉన్నాయి.

ఓ వైపు ఎండలు.. మరో పక్క ఉమ్మదీత. ఇంకోవైపు వేసవి తాపానికి గొంతెండిపోతుండటం సహజం. ఈకాలంలో డీహైడ్రేషన్‌ను తగ్గించటానికి సహజ పానీయాలు ఎంతగానే ఉపయోగపడతాయి. అయితే ఈ పానీయాలను మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది.

*నిమ్మాపుదీనా జ్యూస్‌( NEEM PUDENA JUICE) : నిమ్మా పుదీనా జ్యూస్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటే మంచిది. ఒక గ్లాస్‌ నిమ్మాపుదీనా జ్యూస్‌ తీసుకుంటే 76 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. పిల్లలకు ఇది చాలా..చాలా హెల్దీ. పుదీనా..నీరసానికి బెస్ట్ రెమిడీ..స్కూల్స్ కి వెళ్లే పిల్లలకి ఇవ్వండి. బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది.

*ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌( ORANGE SPORTS DRINKS) : ఎలక్ట్రోలైట్‌ అధికంగా ఉండే 100 శాతం సహజసిద్ధమైన జ్యూసులు డీ హైడ్రేషన్‌ నుంచి ఉపశమనాన్ని కల్గిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌ ఒకటి. ఎండలో బాగా కష్టపడే వారికి, ఎక్కువగా అలసటకు గురయ్యే వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.

*దానిమ్మ రసం : ఇంట్లో రెండే రెండు నిముషాల్లో తయారుచేసుకోగల ఈ దానిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌తో 75 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. ఈ రసంలో 18.5 గ్రాముల కార్బొహైడ్రేట్స్‌, జీరో కొలెస్ట్రాలు ఉంటాయి.

* వాటర్‌ మెలన్‌ చిల్లర్‌( WATER MELON CILLER) : వేసవిలో ఎక్కువ మంది ఇష్టంగా తినేది పుచ్చకాయ. దీంతో, జ్యూస్‌ను చాలా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ, దానిమ్మ, నిమ్మ వాటర్ తో ఫుల్ చిల్ అయిపోవచ్చు. వాటర్ మిలన్ హెల్దీ నే కాదు...వెయిట్ లాస్ కి ...చెడు కొలస్ట్రాల్ కూడా తగ్గుతాయి.సో ట్రై ఇట్.

* పుల్లటి వాటర్‌ : వేసవి ఈ పానీయం శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఒక గ్లాసు నీటిలో దోసకాయ ముక్క, కొన్ని పుదీనా ఆకులు, నారింజ ముక్కలను ఉంచితో ఈ నీటిని పుల్లటి రుచి వస్తుంది. ఇందులో మీకు ఇమ్యూనిటీ కూడా వస్తుంది.

* వెన్నతీసిన పాలు : ఈ పానీయంలో ప్రొటీన్లు సమృద్ధిగా కేలరీలు తక్కువగా ఉంటాయి. వేడిని తగ్గించటానికి ఇవి దోహదపడతాయి. దాహార్తిని తీరుస్తుంది. ఆకలి పెరుగుతుంది. పిల్లలకు ఇది చాలా మంచిది.

*మసాలా లస్సీ: ఒక కప్పు పెరుగులో కొంత నీరు, జీలకర్ర, అల్లం ముక్కలు, చిటికెడు ఉప్పు వేయాలి. ఈ పానీయం తయారుకావటానికి బాగా కలపాలి. దీని వల్ల పొట్టలో ఏదైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గుతాయి.

* ఐస్‌తో బటర్‌మిల్క్‌ : కొంత పెరుగును తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గుజ్జు, కొన్ని ఎండిన పుదీనా ఆకులు కలపాలి. కుండవి చిన్న కూజాలు ఉంటాయి. వాటిలో వేసుకొండి భలే మజా ఉంటుంది.

బోలేడు డ్రింక్స్ ఉన్నాయి. మీరు కూల్ డ్రింక్స్ కు దూరం గా వెళ్లి...ఈ డ్రింక్స్ కు దగ్గరగా వెళ్తే...మీ ఆరోగ్యంగా ఉంటారు.

Tags:
Next Story
Share it