Cholesterol: కొలెస్ట్రాల్ ను మంచులా కరిగించే ఫుడ్స్ ఇవే..?

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే ఉబకాయంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తగ్గించడం కోసం ఆసుపత్రులు, జిమ్ సెంటర్ల

Cholesterol: కొలెస్ట్రాల్ ను మంచులా కరిగించే ఫుడ్స్ ఇవే..?
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే ఉబకాయంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తగ్గించడం కోసం ఆసుపత్రులు, జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఏ మాత్రం మార్పు కనిపించడం లేదని బాధపడుతున్నారు. అలాంటి వారికి ఇంటి దగ్గర నుంచి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడం కోసం ఏ ఏ పదార్థాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్తిమీర:

మనం ఏదైనా కర్రీ వండుకున్నామంటే తప్పనిసరిగా అందులో కొత్తిమీర ఉండాల్సిందే. ఈ ఆకు వేస్తేనే ఆ మంచి సువాసన వచ్చి రుచిని అందిస్తుంది. అలాంటి కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కొత్తిమీర ఆకు రసం రక్తం శుద్ధికి ఎంతో ఉపయోగపడుతుందట. కాబట్టి తినే ఫుడ్ లో కొత్తిమీర ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

కరివేపాకు:

ముఖ్యంగా సాంబార్లలో కరివేపాకు ఎక్కువగా వాడుతూ ఉంటాం. కొంతమంది కరివేపాకు మనం తినే ఆహారంలో వస్తే తీసి పక్కన పెడతారు.. కానీ అలా చేయకూడదట. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదపడతాయట. దీని రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నెయ్యిలా కరిగిపోతుందట..

అలోవెరా:

కలబంద అనేది అనేక రోగాలకు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ అలోవెరాను ఉదయాన్నే పరిగడుపున తీసుకుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

తులసి ఆకులు:

తులసి చెట్టును మనం దేవుడి ప్రతికగా కొలుస్తాం. కానీ దీని ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు జీర్ణ క్రియ మెరుగుపరచడంలో కాకుండా ఖాళీ కడుపులో తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. అంతేకాకుండా రక్తం శుద్ధి చేసి చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

Tags:
Next Story
Share it