త్వరలో మీ పెళ్ళా..ఈ జ్యూస్ తాగారంటే ముఖం మిలమిలా మెరుస్తుంది..!

కొత్తగా పెళ్లి చేసుకునేవారు పెళ్లిరోజున అందంగా కనిపించడం కోసం రకరకాలుగా వర్కౌట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది పూర్తిగా బ్యూటీ పార్లర్ లోనే ఉంటారు. ఇలా ఎలాగోలా

త్వరలో మీ పెళ్ళా..ఈ జ్యూస్ తాగారంటే ముఖం మిలమిలా మెరుస్తుంది..!
X

న్యూస్ లైన్ డెస్క్: కొత్తగా పెళ్లి చేసుకునేవారు పెళ్లిరోజున అందంగా కనిపించడం కోసం రకరకాలుగా వర్కౌట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది పూర్తిగా బ్యూటీ పార్లర్ లోనే ఉంటారు. ఇలా ఎలాగోలా చేసి ముఖంలో గ్లో వచ్చేలా చేస్తూ ఉంటారు. మరి ఇలా కాకుండా న్యాచురల్ గా పెళ్లికి ముందు మంచి గ్లో రావాలి అంటే అమ్మాయిలు ఈ జ్యూస్ తాగితే సరిపోతుంది అంట. ఇవి తాగడం వల్ల ముఖం మిలమిలా మెరుస్తుంది పెళ్లిలో మిరు చాలా అందంగా కనిపిస్తారట. మరి ఆ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం..

టమాటో ఆకు కూర జ్యూస్:

టమాటో జ్యూస్ లో లైకోపిన్ అనే సమ్మేళనం ఉండడం వల్ల అల్ట్రా వైలెట్ కిరణాల నుండి మన చర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన శరీరంలోని కొలైజేన్ ఉత్పత్తికి కారణం అవుతుందట. మొత్తానికి ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అలోవెరా జ్యూస్:

అలోవెరా మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు చేస్తుంది. అలోవెరా మీ చర్మం లోని వాపు అసంతుల్యతను తగ్గిస్తూ ఉంటుంది. ఈ రెండు జ్యూస్లను కలిపి తాగడం వల్ల మీ చర్మం మెరిసిపోతూ ఉంటుంది.

పాలకూర నిమ్మరసం:

ఆకుకూరల్లో అద్భుతమైన పోషక పదార్థాలు ఉంటాయి. ఇది మన శరీరంలోని విష పదార్థాలను తొలగించి చర్మం నిగనిగా మెరిసేలా చేస్తుంది. ఈ పాలకూర రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన అందుతుంది దీనివల్ల కొల్లేజాన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది.

ఏబీసీ జ్యూస్:

క్యారెట్ జ్యూస్ యాపిల్, బీట్రూట్ వంటి జ్యుసుల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెరుపుని ఇవ్వడమే కాకుండా ఇందులో మెగ్నీషియం,విటమిన్ సి, ఐరన్ విటమిన్ b6, ఉంటాయి. ఇది స్త్రీల యొక్క చర్మాన్ని అందంగా తయారవ్వడమే కాకుండా నిగనిగా మెరిసేలా చేస్తుంది.

దానిమ్మ జ్యూస్:

దానిమ్మలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన చర్మాన్ని ఎప్పుడు యవ్వనంగా ఉంచేలా చేస్తుంది. ఇందులో విటమిన్ C ఎక్కువగా ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

యాపిల్ జ్యూస్:

ఈ జ్యూస్ లో చర్మానికి ఎంతో మేలు కలిగించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆపిల్ జ్యూస్ తో పాటు, కివి జ్యూస్ ని కూడా కలుపుకొని తాగితే విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయట. కాబట్టి పెళ్లికి ముందు ఈ జ్యూసులను మీరు ప్రతిరోజు తాగడం వల్ల పెళ్లి సమయానికి మీ చర్మం మిల మిల మెరుస్తూ పెళ్లి కళ ఉట్టి పడుతుందని అంటున్నారు.

Tags:
Next Story
Share it