Akshaya Tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు

ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఈ ఏడాది అక్షయతృతీయ రోజు మీరు ఏం కొనాలనుకుంటున్నారు.

Akshaya Tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఈ ఏడాది అక్షయతృతీయ రోజు మీరు ఏం కొనాలనుకుంటున్నారు.అక్షయతృతీయ ఎప్పుడు అసలు పండుగ ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది..

అక్షయతృతీయ( akshaya tritiya) రోజంతా అమృతాల ఘడియ. ఈ రోజు యమగండాలు గాని ...చెడు గడియలు కాని ..అన్ని బాగుంటాయి. రక్షకుడిగా కుబేరుడు( kubera) నియమితుడైన రోజిది. శ్రీ మహావిష్ణువు( maha vishnu) లక్ష్మీదేవిని( lakshmi) పెళ్లిచేసుకున్న రోజు కూడా ఇదే అని చెబుతారు. అందుకే ఈ రోజు అమ్మవారిని అలంకరిస్తారు. చాలామంది ఎగబడి బంగారం కొంటారు.

కాని బంగారంతో అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు..దాన, ధర్మాలు( dharamam) చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్టు శివపురాణంలో ఉంది. ఈ రోజు చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుకే అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు అంటే అక్షయ తృతీయ ఏం చేసినా ..దాని ఫలితం ఎక్కువ రెట్లు పెరుగుతుందని పురాణాల వాక్కు.

* నిరుపేద అయిన కుచేలుడిని( kuchela) శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు. శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితున్నికరుణాకాటాక్షాలందించిన రోజు.* శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు

*పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే

* వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ

*అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజే

* కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజే

* కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదే

* ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..

*బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది.

* సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ.

ఇన్ని మంచి పనులు మొదలవుతాయి. ఆరోజు దానధర్మాలు చేయండి. మీకు ఫలితం డబుల్ అవుతుందంటున్నాయి పురాణాలు.

Tags:
Next Story
Share it