Marriage muhurtham: ఈ రెండు నెలలు...ఇక ముహూర్తాలు లేనట్లే

కొత్త ఏడాది తమ జీవితం బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ప్రేమించుకున్న జంట పెళ్లి ( marraige) చేసుకోవాలని ఎదురు చూస్తారు.

Marriage muhurtham: ఈ రెండు నెలలు...ఇక ముహూర్తాలు లేనట్లే
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొత్త ఏడాది తమ జీవితం బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ప్రేమించుకున్న జంట పెళ్లి ( marraige) చేసుకోవాలని ఎదురు చూస్తారు. తల్లి దండ్రులు ( patrents) కూడా తమ పిల్లలకి పెళ్లీడు వచ్చిందని ముహూర్తాలు ఉంటే పెళ్లి చేయాలని ఆశ పడతారు. అయితే ఈ నెల 28 వ తారీఖు నుంచి ఇక రెండు నెలల పాటు ముహూర్తాలు లేవంటున్నారు పండితులు.

పంచాంగం ప్రకారం 2024 మే, జూన్ నెలల్లో( june) పెళ్ళిళ్ళు చేసుకోవడానికి శుభ ముహూర్తాలు లేవు. ఈ రెండు నెలలు శూన్య మాసం( sunya masam) కింద పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మంచి రోజులు లేవు. జులై నెలలో శుభ ముహూర్త తేదీలోనే మంచి ముహూర్తాలున్నాయి. జులై లో ...దాదాపు 5 రోజులు పెళ్లి ముహూర్తాలున్నాయి.

రెండు నెలల తర్వాత మళ్ళీ జులై( july) నెలలో పెళ్లి చేసుకునేందుకు మంచి సమయం ఉంది. జులై 9( మంగళవారం), జులై 11( గురువారం), జులై 12( శుక్రవారం), జులై 13( శనివారం), జులై 14( ఆదివారం), జులై 15( సోమవారం) ఉన్నాయి. మూడు నెలల తర్వాత మళ్ళీ పెళ్లి ముహూర్తాలు రావడంతో కాస్త బిజీ బిజీగా పెళ్లి మండపాలు ఉండబోతున్నాయి.

నవంబర్ లో అయితే దాదాపు ఓ పది రోజుల పాటు...ముహూర్తాలున్నాయి. 12( మంగళవారం), నవంబర్ 13( బుధవారం), నవంబర్ 16( శనివారం), నవంబర్ 17( ఆదివారం), నవంబర్ 18( సోమవారం), సవంబర్ 22( శుక్రవారం), నవంబర్ 23( శనివారం), నవంబర్ 25( సోమవారం), నవంబర్ 26( మంగళవారం), నవంబర్ 28( గురువారం), నవంబర్ 29( శుక్రవారం) మంచి రోజులున్నాయి.. అంతేకాదండోయ్ డిసెంబర్ లో దాదాపు...ఐదురోజుల పెళ్లి ముహూర్తాలున్నాయి.

Tags:
Next Story
Share it