RAJASTHAN: ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే..ఊరు మరింత పచ్చగా మారుతుందట!

రాజస్థాన్( RAJASTHAN) అనగానే ఎడారి( DESERT) ప్రాంతం, కల్చర్ , బాల్యవివాహాలు( BALYA VIVAHALU) , నిరక్ష్యరాస్యత, ఎండలు( SUNLIGHT) ఇవే గుర్తొచ్చేవి.

RAJASTHAN: ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే..ఊరు మరింత పచ్చగా మారుతుందట!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాజస్థాన్( RAJASTHAN) అనగానే ఎడారి( DESERT) ప్రాంతం, కల్చర్ , బాల్యవివాహాలు( BALYA VIVAHALU) , నిరక్ష్యరాస్యత, ఎండలు( SUNLIGHT) ఇవే గుర్తొచ్చేవి. కాని ఇప్పుడు ఈ గ్రామం రాజస్థాన్ కు తిరుగులేని మంచి పేరు సంపాదించింది. ఓ మంచి ఆలోచన ఎంత మంది ఆడపిల్లల లైఫ్ ని సెటిల్ చేసిందో తెలిసేలా చేసింది. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే నష్టం...చంపేయాలనుకునే రోజుల నుంచి ఆడపిల్ల పుడితే ప్రకృతి పుట్టిందని నమ్మే రోజులు వచ్చాయి. అమ్మాయి ని పుట్టించినందుకు గాను..111 చెట్లు నాటుతారు అక్కడ గ్రామస్థులు.

తన స్వంత ప్రియమైన కుమార్తెను కోల్పోయిన తర్వాత, శ్యామ్ సుందర్ పలివాల్( SYAM SUNDAR PALUWAL) తన గ్రామంలోని ప్రతి అమ్మాయి వారి మగవారితో సమానంగా అభివృద్ధి చెందాలని నిర్ణయించుకున్నాడు.ఆడ పిల్లల కలలకు కూడా విలువ ఉంటుందని నమ్మాడు,ఆడపిల్ల( GIRL BABY) పుడితే 111 మొక్కలు నాటే సంప్రదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం కారణంగా, ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న రాజస్థాన్ ఇప్పుడు 3.5 లక్షల చెట్లతో అలంకరించబడింది.

ఈ గ్రామంలో దాదాపు 15 వేల మంది జనాభా ఉన్నారు. ఈ కుటుంబాల్లో ఎక్కడ ఎవరికి ఆడపిల్ల పుట్టినా సరే దాదాపు 111 మొక్కలను నాటాల్సిందే...ఈ మొక్కలు నాటడానికి ఊరంతా కలిసి మెలిసి నాటుతారు. అంతేకాదు పాప పుట్టగానే 31 వేల రూపాయిలు ఊరంతా కలిసి ఆ పాప పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. చాలా హ్యాపీ గా పండుగ చేసుకుంటారు. ఇలా ఇప్పటికి దాదాపు కొన్ని లక్షల చెట్లు పెంచారు.21 దాటే వరకు ఆడపిల్లకు పెళ్లి చేయమని ఓ బాండ్ పేపర్ మీద కూడా రాసుకుంటారు.

నిజానికి ఈ గ్రామంలో మార్బుల్( MARBLE) తవ్వకాలు చాలా ఎక్కువ జరుగుతాయి. దీని కారణంగానే ఆ ఊర్లో నీరు కాని కనీస అవసరాలు కాని ఉండవు. ఈ తవ్వకాల వల్ల ఎట్టిపరిస్థితుల్లోను భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. తిరిగి ప్రకృతిని ( NATURE) కాపాడాలనేదే ఈ ఊరివారి ఆలోచన. చిన్న ఆలోచన కొన్ని వేల జీవితాలను మార్చేసింది. శ్యామసుందర్ అనే వ్యక్తి కి జరిగిన అన్యాయానికి ..ఎన్ని వేల మంది ఆడపిల్లల భవిష్యత్తు మారిపోయిందో ..చాలా ఆదర్శవంతమైన ఊరుగా మారిపోయింది.

Tags:
Next Story
Share it