henley and partners: టాప్ రిచెస్ట్ సిటీస్ లో...రెండు సిటీలు ఇండియాలోనే!

వరల్డ్ లో బెస్ట్ కోటీశ్వరుల లిస్ట్ బయటపెట్టింది ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్ నర్ సర్వే .

henley and partners: టాప్ రిచెస్ట్ సిటీస్ లో...రెండు సిటీలు ఇండియాలోనే!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వరల్డ్( WORLD) లో బెస్ట్ కోటీశ్వరుల లిస్ట్ బయటపెట్టింది ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్ నర్స్( henley and partners) సర్వే. దాదాపు 100మంది కోటీశ్వరుల సిటీస్ లో భారత్ లో రెండు సిటీస్ ఉన్నాయి.న్యూయార్క్( NEWYORK) నగరంలో 3,49,500 మంది కోటీశ్వరులు ఉన్నట్లు నివేదిక తెలిపింది. గత పదేళ్లతో పోలిస్తే అక్కడ ఉన్నవారి సంఖ్య48 శాతం పెరిగిందికూడా .

భారత్( INDIA) లోని ముంబై( MUMBAI), ఢిల్లీ( DELHI) నగరాల్లో ఈ రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారట . దేశ ఆర్థిక రాజధాని ముంబై( MUMBAI)లో 58,800 మంది కోటీశ్వరులు, ఢిల్లీ లో దాదాపు 30వేల మంది కోటీశ్వరులు ఉండేవారు. దాదాపు 90 శాతం కోటీశ్వరులు పెరుగుతున్నట్లు సర్వే తెలిపింది.

చైనాలోని( CHINA) ప్రధాన నగరాల్లో కోటీశ్వరుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు హెన్లీ అండ్ పార్ట్ నర్స్( henley and partners) తమ అధ్యయనంలో గుర్తించింది. 50,300 మంది కోటీశ్వరులు, 154 మంది శతకోటీశ్వరులు, 22 మంది అపర కుబేరులతో షెంజెన్( SHANZEN) నగరంలో గత పదేళ్లతో పోలిస్తే ఏకంగా 140 శాతం మిలియనీర్ల వృద్ధి రేటు పెరిగింది. అలాగే హాంగ్ జౌ( HANG JOW), గ్వాంగ్ జౌ( GWANGJOW) నగరాల్లోనూ మిలియనీర్ల సంఖ్య వరుసగా 125 శాతం, 11‌‌0 శాతం పెరిగినట్లు అధ్యయనం తేల్చింది. అయితే జపాన్ లోని టోక్యో, ఒసాకా నగరాల్లో నివసించే మిలియనీర్ల సంఖ్య గత పదేళ్లతో పోలిస్తే తగ్గినట్లు సర్వే వెల్లడించడం గమనార్హం. ఈ సర్వేలో భారత్ కు చోటు దక్కడం ఆనందంగా ఉందంటున్నారు నెటిజన్లు.

Tags:
Next Story
Share it