AKARSH: ఓ ఇంటి వాడైన బుల్లితెర నటుడు..లేడీ ఫ్యాన్స్ ఏమైపోతారో !

బుల్లి తెర నటుల్లో ఒకరు., 'మామగారు' ( MAMA GARU) సీరియల్‌ ఫేం గంగాధర్‌ ..సీరియల్స్ చూసే వారికి ఎవ్వరికైనా ఆకర్ష్ బాగా తెలుస్తుంది

AKARSH: ఓ ఇంటి వాడైన బుల్లితెర నటుడు..లేడీ ఫ్యాన్స్ ఏమైపోతారో !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆకర్ష్ ( AKARSH)కు పెళ్లి జరుగుతుంది. ఇంతకీ ఎవరు ఈ ఆకర్ష్ అంటారేమో...బుల్లి తెర నటుల్లో ఒకరు., 'మామగారు' ( MAMA GARU) సీరియల్‌ ఫేం గంగాధర్‌ ..సీరియల్స్ చూసే వారికి ఎవ్వరికైనా ఆకర్ష్ బాగా తెలుస్తుంది. విజయేంద్రసింహా , యాంకర్ నిఖిల్ వరుస పిక్స్ పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది.

కర్ణాటకకు ( KARNATAKA) చెందిన ఆకర్ష బైరమూడి తెలుగు, కన్నడ సీరియల్స్‌లో హీరోగా నటిస్తూ గుర్తింపు పొందాడు. తెలుగులో పున్నాగ, అత్తారింట్లో అక్క చెల్లెళ్లు, అగ్నిపరీక్ష వంటి సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. తన లవర్ ఐశ్వర్య( AISHWARYA) . గతంలో ఓ టీవీ షోలో ఆమెను పరిచయం చేసి ప్రేమ విషయం బయటపెట్టాడు ఆకర్ష్‌. కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం తాజాగా వీరిద్దరు ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

ఈ పెళ్లిలో యూట్యూబర్ నిఖిల్( NIKHIL) సందడే కనిపించింది. పెళ్లి వేడుక మొదలైనప్పటి నుంచి అంటే హల్ది( HALDI) , మెహందీ( MEHANDI) ,బ్యాచీలర్‌ పార్టీ( BACHLOR PARTY), ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు పిక్స్ ను షేర్ చేశారు. అంతేకాదు ఇప్పటి వరకు పెళ్లి కూతురు పిక్ ను చూపించకుండే వీడియోస్ పోస్ట్ చేశారు. ఈ పెళ్లిలో కన్నడ, తెలుగు, సీరియల్ యాక్టర్స్ పాటు యాంకర్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.




Tags:
Next Story
Share it