Bayilvan Ranganathan: జ్యోతిక అత్తింటి పరువు తీసేసింది..!

తమిళ ఇండస్ట్రీకి చెందిన సూర్య జ్యోతిక జంటకి ఎంతమంది అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఈ జంట సినిమాల్లో నటించే సమయంలోనే ప్రేమలో పడి పెద్దలు

Bayilvan Ranganathan: జ్యోతిక అత్తింటి పరువు తీసేసింది..!
X

న్యూస్ లైన్ డెస్క్: తమిళ ఇండస్ట్రీకి చెందిన సూర్య జ్యోతిక(Suriya,Jyothika) జంటకి ఎంతమంది అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఈ జంట సినిమాల్లో నటించే సమయంలోనే ప్రేమలో పడి పెద్దలు ఒప్పుకుంటారో లేదో అన్న భయంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.కానీ ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు తెలియడంతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావడంతో కొన్ని కండిషన్ల మీద పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ కండిషన్ ఏంటంటే.. జ్యోతిక మళ్ళీ సినిమాల్లో నటించకూడదు..

ఈ షరతుని జ్యోతిక(Jyothika) మామ అంటే సూర్య తండ్రి జ్యోతిక కు విధించారట. అయితే ఎలాగైనా పెళ్లి జరగాలి పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి అనుకున్న జ్యోతిక ఓకే చేసి కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయి పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక మళ్ళీ సినిమాలపై ఇష్టం పెరిగింది జ్యోతికకి.అలా తన భర్త సూర్యని ఒప్పించి సినిమాల్లోకి వచ్చింది. అయితే ఈమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఇంట్లో గొడవలు అయ్యాయి అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ గొడవలు ఇలాగే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వీళ్ళు కుటుంబంతో కలిసి ముంబై(Mumbai) లోనే ఉంటున్నారు. అత్తింటికి దూరంగా జ్యోతిక ఉంటుంది. అలాగే రీసెంట్ గా తమిళనాడులో ఎలక్షన్స్ సమయంలో కూడ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.


కేవలం సూర్య మాత్రమే వచ్చారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా తమిళ సినీ జర్నలిస్టు నటుడు అయినటువంటి బయిల్వాన్ రంగనాథన్ (Bayilvan Ranganathan) జ్యోతిక ఫై షాకింగ్ కామెంట్స్ చేశార. ఆయన మాట్లాడుతూ.. అసలు జ్యోతిక అత్తింటి పరువును పూర్తిగా తీసేస్తోంది. శివకుమార్(Shiva kumar) ని తల ఎత్తుకోకుండా చేస్తోంది. ఎలక్షన్ సమయంలో సూర్య వచ్చి జ్యోతిక రాకపోతే మీడియా వాళ్ళు సూర్య తండ్రిని ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెబుతాడు. జ్యోతిక(Jyothika) కు కాస్తయిన బాధ్యత ఉండాలి కదా.. పెళ్లయ్యాక అత్తింటివారికి గౌరవ మర్యాదలు ఇస్తూ విధేయురాలిగా ఉండాలి. కానీ అలాంటిది జ్యోతిక వారి పరువు మొత్తం తీసేస్తోంది. గత కొద్దిరోజులుగా జ్యోతిక ప్రవర్తన బాగుండడం లేదు అంటూ సంచలన కామెంట్లు చేశారు బయిల్వాన్ రంగనాథన్. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్లు పెడుతున్నారు

Tags:
Next Story
Share it