Aamani:విడాకులు తీసుకున్న ఆమని..కారణం అదేనా..?

సీనియర్ నటి ఆమని అంటే తెలియని సౌత్ సినీ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈమె 90స్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే అలాంటి

Aamani:విడాకులు తీసుకున్న ఆమని..కారణం అదేనా..?
X

న్యూస్ లైన్ డెస్క్: సీనియర్ నటి ఆమని (Aamani) అంటే తెలియని సౌత్ సినీ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈమె 90స్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా భర్తకి దూరంగా ఉంటుంది.దీంతో ఈ హీరోయిన్ భర్తకి విడాకులు ఇచ్చేసిందా అని చాలామంది భావించారు.

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని తన భర్తతో విడిపోవడం గురించి క్లారిటీ ఇచ్చింది. ఆమని తమిళ నిర్మాత అయిన ఖాజా మొహియుద్దిన్ (Khaja mohiyuddhin) ని పెళ్లాడింది. అయితే వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. చూడడంతోనే ఆయనకు కనెక్ట్ అయి ప్రేమించి పెళ్లాడిందట. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కి ఒక కొడుకు,ఒక కూతురు కూడా పుట్టారు. ఇక పిల్లలు పుట్టే వరకు చాలా హ్యాపీగా ఉన్న వీరి జీవితంలో అనుకోకుండా కొన్ని ఇబ్బందులు వచ్చాయట.ఇక ఆ ఇబ్బందులను వీరిద్దరూ ఎంతో ఓపిగ్గా ఉండి తీర్చేసుకున్నారట. ఒకానొక సమయంలో ఆమని (Aamani) భర్త అప్పులు తట్టుకోలేక చనిపోవాలి అనుకున్నారట.

కానీ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్(Realestate business) చేసి అప్పులు అన్ని తీర్చేసి ఎలాంటి అప్పు లేకుండా డబ్బులు సంపాదించుకున్నారట. అయితే భర్తతో విడిపోవడం గురించి ఆమని మాట్లాడుతూ.. నేను నా భర్తకు విడాకులు అయితే ఇవ్వలేదు.కానీ ఫ్రెండ్లీగా ఇద్దరం విడిపోయాం. ఇక ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ అవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అలాగే ఫ్రెండ్లీ గానే ఉంటున్నాం. కానీ ఇద్దరం విడిగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఇక పిల్లల బాధ్యత పూర్తిగా నేనే తీసుకున్నాను. అలాగే నేను దూరంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఫోన్స్ మాట్లాడుకుంటాం అలాగే టైం దొరికితే కలుసుకుంటాం..అంటూ తన విడాకుల విషయంపై ఫైనల్ గా క్లారిటీ ఇచ్చింది ఆమని(Aamani)

Tags:
Next Story
Share it