HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్

ప్రత్యూష ట్రస్ట్’. అనాథ పిల్లలకు సాయం చేయడం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తన జీవితంలోని ప్రతీ స్పెషల్ సందర్భాన్ని ఆ పిల్లలతోనే జరుపుకుంటుంది సామ్.

HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హీరోయిన్లకు వెండితెరపై లైఫ్‌స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత గ్లామర్ ఉన్నా..ఇండస్ట్రీ లో వనవాస కాలం మాత్రమే ఉంటారని ..తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతారని అంటుంటారు.కొందరు హీరోయిన్లు మాత్రమే ఆ స్టేట్‌మెంట్ తప్పు అని నిరూపించగలరు. ఆ లిస్ట్ లో సమంత( SAMANTHA) టాప్ లో ఉంటారు. సేమ్ ఎనర్జీతో ...అసలు 2010 లో ఎలా ఉందో ఇప్పటికి అలానే ఉంది. ప్రొఫెషనల్‌గా మాత్రమే కాకుండా.. పర్సనల్‌గా కూడా ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది . ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది.

మొదటి సినిమాలోనే జెస్సీగా( JESSY) యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే తనకు స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడానికి పెద్దగా సమయం పట్టలేదు. గోల్డెన్ లెగ్ ( GOLDEN LEG) అనే ట్యాగ్‌ను కూడా దక్కించుకుంది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా సమంత ఒక సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగించింది. ఇక ‘ఏమాయ చేశావే’( EM MAYA CHESAVE) తర్వాత చాలాకాలం పాటు గౌతమ్ మీనన్ ( GOTHAM MEANON) సినిమా అంటే సమంత కచ్చితంగా ఉంటుంది అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అంత బాగా నటించేది కూడా. 2017లో పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్య( NAGA CHAITANYA) .. 2021లో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీని వల్ల కాస్త నెగిటివ్ కామెంట్లు వచ్చినా జనాలు పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. ఆదరిస్తున్నారు.

2022లో తాను మాయాసైటీస్ అనే ఇమ్యూనిటీ ( IMMUNITY) వ్యాధితో బాధపడుతున్నానని సమంత బయటపెట్టింది. దాని వల్ల పర్సనల్‌గా తను చాలా వీక్ అయిపోయింది. మెల్లగా కోలుకుంటుంది.‘ప్రత్యూష ట్రస్ట్’. తన కెరీర్ ప్రారంభంలోనే అనాథ పిల్లలకు సాయం చేయడం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తన జీవితంలోని ప్రతీ స్పెషల్ సందర్భాన్ని ఆ పిల్లలతోనే జరుపుకుంటుంది సామ్. హ్యాపీ బర్త్ డే సామ్.

Tags:
Next Story
Share it