Kannappa: ఇంతకీ 'కన్నప్ప'లో ప్రభాస్ శివుడా...నందీశ్వరుడా?

ప్రభాస్ నందీశ్వరుడి పాత్రను పోషించనున్నాడనే టాక్ వచ్చింది. అయితే రీసెంట్ గా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Kannappa: ఇంతకీ కన్నప్పలో ప్రభాస్ శివుడా...నందీశ్వరుడా?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మంచు విష్ణు ( MANCHU VISHNU) కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో కన్నప్ప( KANNAPPA) సినిమా వస్తుంది. విజువల్స్ విషయంలో మంచు ఫ్యామిలీ చాలా కేర్ తీసుకుంటుంది. పాన్ ఇండియా ( PAN INDIA) స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచన ఉన్నందున, మేకింగ్ విషయం లో లొకేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ సినిమాలో శివుడిగా( SHIVA) ప్రభాస్( PRABHAS) కనిపించనున్నట్టు టాక్ రాగానే ఫ్యాన్స్ గోల గోల చేసేశారు. ఎప్పుడైతే ఈ సినిమాలో అక్షయ్ కుమార్( AKSHAI KUMAR) కూడా చేయనున్నాడనే టాక్ వచ్చిందో అప్పటి నుంచి కన్నప్ప అప్ డేట్స్ ఏం వచ్చినా ప్రభాస్ గురించి చెప్పమని అడుగుతున్నారు. కానీ నో రిప్లై ..ప్రభాస్ ( PRABHAS) నందీశ్వరుడి పాత్రను పోషించనున్నాడనే టాక్ వచ్చింది. అప్పటి నుంచి కూడా అభిమానులు కాస్త అసంతృప్తితోనే ఉన్నారు. అయితే రీసెంట్ గా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఆయన కాళ్లు మాత్రమే కనిపించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. కడియాలు ధరించిన పాదాలు .. పులిచర్మాన్ని ధరించిన తీరాచూస్తే, ఈ సినిమాలో ఆయన పోషించింది శివుడి పాత్రనే అనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పాత్రేంటి...ప్రభాస్ పాత్రేంటి..అసలు ఏం చేస్తున్నాడు ఇవన్నీ ఓ ప్రెస్ మీట్ పెట్టి చిన్న హింట్ ఇస్తే బాగుంటుందంటున్నారు నెటిజన్లు.

Tags:
Next Story
Share it