Keerthi Bhat: ఆ టైంలో 200కి వస్తావా అంటూ అక్కడ టచ్ చేసేవారు.!

తెలుగు బుల్లితెర నటుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కీర్తి బట్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈమెను ఆరాధిస్తారు. అలాంటి ఈ బ్యూటీ బిగ్ బాస్

Keerthi Bhat: ఆ టైంలో 200కి వస్తావా అంటూ అక్కడ టచ్ చేసేవారు.!
X

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు బుల్లితెర నటుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కీర్తి బట్(keerthi bhat). ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈమెను ఆరాధిస్తారు. అలాంటి ఈ బ్యూటీ బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సాధించింది. బిగ్ బాస్ హౌస్ లో(big boss)తన అంద చెందాలతో పాటు ఆట తీరుతో అభిమానుల మనసులు గెలుచుకుంది. అలాంటి కీర్తి బట్ తన జీవితంలో తన కళ్ళముందే కన్న తల్లిదండ్రులను పోగొట్టుకొని ఇప్పటికీ ఎంతో బాధపడుతుంది. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు కదిలి ఇండస్ట్రీలో రాణిస్తోంది.

అయితే కీర్తి కాఫీ విత్ శోభా(coffee with shoba)ప్రోగ్రాంకి వచ్చి నా జీవితంలో ఎదుర్కొన్నటువంటి విషాద సంఘటన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. అంతేకాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి ఎక్కడపడితే అక్కడ తాకుతూ 200 రూపాయలు ఇస్తా, వస్తావా అని కూడా అడిగారట. మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాం.. అయితే ఈ షోలో శోభ కార్తీక్ ని(karthik) వివాహం చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉన్నావని అడిగితే చాలా హ్యాపీగా ఉన్నావా అని అడిగితే చాలా హ్యాపీగా ఉన్నానని కీర్తి ఆన్సర్ ఇచ్చారట. ఎందుకంటే ఎవరూ లేని నా లైఫ్ లోకి కొత్త నెంబర్ వచ్చారు. ఇద్దరం అర్థం చేసుకుని నెగటివ్స్ ఏమైనా ఉంటే వదిలేస్తూ హ్యాపీగా ఉంటాం. ఆమధ్య చాలామంది గొడవలు పెట్టి విడిపోవాలని చూశారు అంటూ కీర్తి తెలియజేసింది.

అంతేకాకుండా మా కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్ అయిన తర్వాత మంగళూరుకు తీసుకెళ్లారని, అక్కడ 35 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచారని తెలియజేసింది.ఆ టైంలో నేను ఎన్నో బాడ్ ఇన్సిడెంట్లు చూశానని అన్నది. నన్ను అక్కడున్న వారు ఎక్కడెక్కడో టచ్ చేసేవారు.కానీ నాకు స్పర్శ ఉండేది కాదు.వారు టచ్ చేస్తే నాకు తెలుస్తుంది కానీ నెట్టి వేయడానికి నాకు ఓపిక ఉండేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఎక్కడికివెళ్లాలి అన్న డబ్బులు కావాలి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒకానొక సమయంలో రాత్రి బయటకు వచ్చాను. కొంతమంది వ్యక్తులు వచ్చి 200 రూపాయలకు వస్తావా అని అడిగారు. అదేంటో నాకు అర్థం కాక వస్తాను అనేదాన్ని. కానీ వాళ్ళ మొహాలు చూసి ఆ తర్వాత అర్థం చేసుకొని సైలెంట్ అయ్యేదాన్ని, అలా తన లైఫ్ లో జరిగినటువంటి దారుణమైన సంఘటనలను గుర్తుచేసుకొని కీర్తిబట్(Keerthy bhat) ఎమోషనల్ అయింది.

Tags:
Next Story
Share it