Krishna Mukherjee: మేకప్ రూమ్‌లో బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు..

అసలే గ్లామర్ ( GLAMOUR) ఇండస్ట్రీ ...బయట ఆడపిల్లల్నే వదలడం లేదు...ఇంత పెద్ద ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్( CASTING COUCH) , ఆడవారిని టీజ్ చెయ్యడం చాలా కామన్.

Krishna Mukherjee: మేకప్ రూమ్‌లో బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు..
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలే గ్లామర్ ( GLAMOUR) ఇండస్ట్రీ ...బయట ఆడపిల్లల్నే వదలడం లేదు...ఇంత పెద్ద ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్( CASTING COUCH) , ఆడవారిని టీజ్ చెయ్యడం చాలా కామన్.హిందీ సీరియల్స్‌లో( HINDHI SERIEAL) నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కృష్ణ ముఖర్జీ. కొన్నాళ్లు గా ఎక్కడా స్క్రీన్ మీద కనిపించడం లేదు.

ఒక్కొక్కసారి హీరోయిన్లు బెదిరింపులకు భయపడి కూడా సైలెంట్‌గా తమకు జరిగిన అన్యాయం గురించి బయటపెట్టకుండా ఉండిపోతారు. కానీ ఒక బుల్లితెర నటి మాత్రం తనకు ఇలా జరిగిందంటూ ఓపెన్‌గా సోషల్ మీడియాలో ప్రకటించింది. రెండేళ్లుగా ఒక సీరియల్ నిర్మాత వల్ల తను ఎంత కష్టపడిందో వివరించింది.కృష్ణ ముఖర్జీ. తన కెరీర్ ప్రారంభం అయినప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కించుకుంది.

‘శుభ్ షాగున్’( SHUBH SHAGUN) అనే సీరియల్‌లో నటించడానికి తనకు అవకాశం లభించింది. కానీ ఆ సీరియల్ వల్ల, దాని నిర్మాత ( PRODUCER) వల్ల తనకు కష్టాలు మొదలయ్యాయి . ఆ సీరియల్ వల్లే తన ఇండస్ట్రీ కెరియర్ పోయిందని తెలిపారు. అంతేకాదు షోలో ఎందుకు కనిపించడం లేదు...ఇండస్ట్రీ లో కనిపించడం లేదు ఎందుకు అని అడుగుతున్నారు.

‘నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు నా మేకప్ రూమ్ డోర్లను బద్దలుకొట్టేంత పనిచేశారు. 5 నెలల నుండి నాకు పేమెంట్ ఇవ్వలేదు. అది నాకు చాలా పెద్ద అమౌంట్. నేను ప్రొడక్షన్ హౌజ్, దంగల్ టీవీ ఆఫీస్‌కు వెళ్లినా కూడా వాళ్లు నన్ను పట్టించుకోలేదు. అంతే కాకుండా నాకు చాలాసార్లు ధమ్‌కీ కూడా ఇచ్చారు.

నాకు చాలా భయంగా ఉంది. నాకు న్యాయం కావాలి. ఇది టైప్ చేసేటప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. దీనివల్లే నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. మనం ఎమోషన్స్‌ను లోపల దాచిపెట్టుకొని సోషల్ మీడియాలో కేవలం మంచిని మాత్రమే చూపిస్తాం. ఈ గోలంతా నిర్మాత కుందన్ వల్లే జరుగుతుందని కుందన్ ను ట్యాగ్ చేసింది.

Tags:
Next Story
Share it