Mrunal Thakur :నా తల్లితండ్రుల కారణంగా కెరీర్ ని కోల్పోయాను - మృణాల్ ఠాకూర్

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి మృణాల్ ఠాకూర్.

Mrunal Thakur :నా తల్లితండ్రుల కారణంగా కెరీర్ ని కోల్పోయాను - మృణాల్ ఠాకూర్
X

న్యూస్ లైన్ డెస్క్: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో సీరియల్ ఆర్టిస్టు గా కెరీర్ ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, అక్కడ ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు. కానీ తెలుగు లో ఆమె చేసిన మొదటి సినిమా 'సీతారామం' భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆమెకి మంచి గుర్తింపు లభించింది. నటిగా కూడా ఆమె ఈ సినిమా తో సంపాదించుకున్న పేరు మామూలుది కాదు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఆమె, రీసెంట్ గా విడుదలైన 'ది ఫ్యామిలీ స్టార్' చిత్రం తో మొదటి ఫ్లాప్ ని అందుకుంది.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన అనేక ప్రశ్నలకు చాలా బోల్డ్ గా సమాధానం చెప్పగా అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. తన కెరీర్ లో తల్లితండ్రుల కారణంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది . మా తల్లితండ్రులకు నేను ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండేది కాదని, అందువల్ల బడా స్టార్స్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత నేను కథ , సన్నివేశానికి తగ్గట్టు ముద్దు సన్నివేశాల్లో నటించడం అత్యవసరం అని తల్లితండ్రులకు అర్థం అయ్యేలా చెప్పి సినిమాలు చేస్తున్నాను అంటూ మృణాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Tags:
Next Story
Share it