Pawan: పవన్, బాలయ్య కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ..?

మల్టీ స్టారర్ సినిమాలు అంటే ఒకప్పుడు ఎన్నో వచ్చేవి.కానీ ఈ జనరేషన్లో మాత్రం అవి ఎక్కువగా రావడం లేదు.దానికి ప్రధాన కారణం ఒక హీరోని ఎక్కువ చేసి చూపిస్తే మరో హీరో

Pawan: పవన్, బాలయ్య కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ..?
X

న్యూస్ లైన్ డెస్క్: మల్టీ స్టారర్ సినిమా(Multi starrer movies) లు అంటే ఒకప్పుడు ఎన్నో వచ్చేవి.కానీ ఈ జనరేషన్లో మాత్రం అవి ఎక్కువగా రావడం లేదు.దానికి ప్రధాన కారణం ఒక హీరోని ఎక్కువ చేసి చూపిస్తే మరో హీరో అభిమానులు అస్సలు ఊరుకోరు.ఈ కారణంతోనే చాలామంది డైరెక్టర్లు మల్టీస్టారర్ మూవీస్ తీయాలి అనే కోరిక ఉన్నప్పటికీ కూడా వాటిని తెరకెక్కించడం లేదు.

అయితే రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) విజయవంతం అయినప్పటికీ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య గొడవ అయితే జరిగింది. ఇదిలా ఉంటే అప్పట్లో బాలకృష్ణ,పవన్ కళ్యాణ్(Balakrishna,pawan kalyan) కాంబినేషన్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ రావాల్సిందట. కానీ బాలకృష్ణ ఈ సినిమాని అభిమానుల కోసం రిజెక్ట్ చేశారట.ఇక ఆ సినిమా ఏదో కాదు పవన్ కళ్యాణ్,వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల మూవీ(Gopala gopala movie). దేవుడిపై నమ్మకం లేని పాత్రలో వెంకటేష్ నటించగా,దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర కోసం ముందుగా ఈ మూవీ డైరెక్టర్ బాలకృష్ణనే అనుకున్నారట.


ఆయన కోసమే కథ రాసుకొని బాలకృష్ణ(Balakrishna) కు చెప్పగా పవన్ దేవుడిగా నటిస్తున్నప్పుడు నేను సామాన్య మానవుడి లాగా నటిస్తే నా అభిమానులు ఒప్పుకోరు. గొడవలు జరిగిపోతాయి. నేను ఈ సినిమాలో నటించను.నా ఇమేజ్ కి ఈ కథ సెట్ అవ్వదు అంటూ సున్నితంగా బాలకృష్ణ రిజెక్ట్ చేశారట.ఇక ఈ సినిమాని బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో వెంకటేష్(Venkatesh) కి స్టోరీ చెప్పగా ఆయన చేస్తానని ఓకే చేయడంతో పవన్ కళ్యాణ్ వెంకటేష్ కాంబోలో గోపాల గోపాల మూవీ వచ్చింది.ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలా పవన్ (Pawan) బాలకృష్ణ కాంబోలో ఈ సినిమా మిస్సయ్యి పవన్ వెంకటేష్ కాంబోలో వచ్చింది.

Tags:
Next Story
Share it