Samantha: సమంత "మా ఇంటి బంగారం" పోస్టర్ రిలీజ్.!

స్టార్ హీరోయిన్ సమంత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్దం దాటిపోయింది. ఇక తాజాగా సమంత తన 37 వ బర్త్డే వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. ఇక చాలా మంది

Samantha: సమంత మా ఇంటి బంగారం పోస్టర్ రిలీజ్.!
X

న్యూస్ లైన్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్దం దాటిపోయింది. ఇక తాజాగా సమంత తన 37 వ బర్త్డే వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. ఇక చాలా మంది హీరో హీరోయిన్లు తమ బర్త్డేలకు తమ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లను,ట్రైలర్లను,టీజర్లను, కొత్తసినిమాలకు సంబంధించినవిషయాలను చెబుతూ ఉంటారు.

అయితే తాజాగా సమంత బర్త్డే (Samantha birthday) సందర్భంగా ఆమెకి సంబంధించిన ఒక కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ అయింది.ఇక సమంత తాజాగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో తానే హీరోయిన్ గా..నిర్మాతగా..రాబోయే సినిమా "మా ఇంటి బంగారం(Ma inti bangaram)".. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.ఇక ఈ పోస్టర్లో సమంత అందంగా సారీ కట్టుకొని చేతిలో గన్ పట్టుకొని సీరియస్ గా చూస్తూ ఉంది.ప్రస్తుతం సమంత కి సంబంధించిన ఈ మూవీ పోస్టర్ వైరల్ గా మారింది.

ఇక సమంత రీసెంట్ గానే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala moving pictures) అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక సమంత ఈ సినిమాలో తానే లీడ్ రోల్ చేస్తోంది.గత కొద్ది రోజులుగా మయో సైటిస్ తో బాధపడుతున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే ఆ వ్యాధి నుండి కాస్త బయటపడినట్టు తెలుస్తోంది. ఇక ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ మాత్రమే కాకుండా సమంత హనీ బన్నీ (Honey bunny) అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ లోని సిటాడిల్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా రాబోతోంది.

https://www.instagram.com/p/C6TJO5KrvMi/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Tags:
Next Story
Share it