Krishnamma Review : ‘కృష్ణమ్మ’ మూవీ రివ్యూ.. సత్యదేవ్ హిట్ట్ పడినట్లేనా

టాలీవుడ్ లో సత్యదేవ్( SATYA DEV) కి చాలా చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. ఏ క్యారక్టర్ అయినా సత్యదేవ్ ప్రాణం పోస్తాడు.

Krishnamma Review : ‘కృష్ణమ్మ’ మూవీ రివ్యూ.. సత్యదేవ్  హిట్ట్ పడినట్లేనా
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ లో సత్యదేవ్( SATYA DEV) కి చాలా చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. ఏ క్యారక్టర్ అయినా సత్యదేవ్ ప్రాణం పోస్తాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా పలు సినిమాలతో మెప్పించిన సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ( KRISHNAMMA) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మాణంలో వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ కృష్ణమ్మ తెరకెక్కింది. ఈ రోజు సత్యదేవ్ సినిమా రిలీజ్ అయ్యింది. ఎలా ఉందో చూద్దాం.

కథ విషయానికొస్తే.. భద్ర(SATYA DEV), కోటి(LAKSHMAN MESALA), శివ(KRISHNA TEJA)ముగ్గురు అనాధలుగా పెరుగుతారు. చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. విజయవాడ వించిపేటలో ఉంటారు. అక్కడ వారంతా దొంగసాక్ష్యం చెప్తుంటారు. వించిపేట దాసన్న దగ్గర గంజాయి తీసుకురావడం లాంటి కొన్ని క్రిమినల్( CRIMINAL) పనులు చేసి భద్ర, కోటి బతుకుతుంటే శివ మాత్రం ఓ ప్రింటింగ్ షాప్ పెట్టుకుంటాడు. ముగ్గురు లైఫ్ లోకి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ కష్టంలోకి వీరెందుకు వస్తున్నారు. వీళ్ల మీద కేసు ఎలా వచ్చింది. అసలు హీరోయిన్ కథేంటి...ఆ కథలో సత్యదేవ్ పాత్ర ఏంటి అదే సినిమా.

సినిమా విశ్లేషణ.. చేయని నేరానికి శిక్ష పడటం ఆ తర్వాత వచ్చి రివెంజ్ తీర్చుకోవడం లాంటి సినిమాలు ఎన్నో ఏళ్లుగా చాలా వస్తూనే ఉన్నాయి. కథ పరంగా కృష్ణమ్మ( KRISHNAMMA) చాలా పాత కథ. కాకపోతే దానికి ముగ్గురు అనాథలను స్నేహితులుగా తీసుకొని స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండించారు. ఓ మోస్తరు స్క్రీన్ ప్లే బాగుంది .కాస్త ఫస్ట హాఫ్ స్లో గా ఉంది.సినిమాలో ఫ్రెండ్షిప్, అనాధలు అనే ఎమోషన్ మాత్రం బాగా పండించగలిగారు. చాలా వరకు ట్విస్ట్, క్లైమాక్స్ అన్ని ఊహించేస్తాం. ఇటీవల రా & రస్టిక్ అని చెప్పి గడ్డాలు పెంచుకోవడం, స్లమ్ లో బతకడం, గొడవలు, నరుక్కోవడాలు అని లుక్స్ మీద ఫోకస్ చేసినంతగా కథపై ఫోకస్ చెయ్యట్లేదు. కృష్ణమ్మలో కూడా ఇదే జరిగింది.

నటీనటుల పర్ఫార్మన్స్.. సత్యదేవ్ ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో వించిపేట భద్రగా మరోసారి అదరగొట్టేసాడు అని చెప్పొచ్చు. ఇక ఫ్రెండ్స్ గా లక్ష్మణ్ మీసాల, కృష్ణ తేజ బాగానే చేసారు. మలయాళీ అమ్మాయి అయినా అథిరా రాజ్ తెలుగమ్మాయిలా మెప్పించింది. అర్చన అయ్యర్ కాసేపు కనిపించి అలరిస్తుంది. పోలీసాఫీసర్స్ గా నందగోపాల్, రఘు కుంచె, మిగిలిన నటీనటులు అంతా ఓకే అనిపించారు. టోటల్ గా సినిమా ఓకే ఓకే ...2.5 ఇవ్వొచ్చు. దర్శకుడుగా గోపాల కృష్ణ మాత్రం సక్సస్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ను చాలా చాలా బాగా చూపించారు. మీరు భారీ అంచనాలు పెట్టుకోకపోతే సూపర్ సినిమా...ఈ వీకెండ్ ఎంజాయ్ చెయ్యొచ్చు.

Tags:
Next Story
Share it