Vijay: విజయ్ మూవీలో సీనియర్ హీరోయిన్..?

తమిళ ఇండస్ట్రీలో దళపతి గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ విషయాన్ని ఆయన

Vijay: విజయ్ మూవీలో సీనియర్ హీరోయిన్..?
X

న్యూస్ లైన్ డెస్క్: తమిళ ఇండస్ట్రీలో దళపతి గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్(Vijay) త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం విజయ్ నటించబోయే చివరి సినిమా గురించి, దాని బడ్జెట్ గురించి, ఆయన తన చివరి సినిమాకు తీసుకుపోయే రెమ్యూనరేషన్ గురించి ఇప్పటికే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తాజాగా మరొక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) సినిమాలో ఒకప్పటి సీనియర్ హీరోయిన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ ఆ సీనియర్ హీరోయన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో ఆడి పాడిన నటి లైలా విజయ్ దళపతి చేయబోయే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(The Gretest Of All Time) అనే మూవీలో నటించబోతుందట. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సీనియర్ నటి లైలా (Laila) నటించబోతున్నట్టు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది


ఇక రీసెంట్ గానే కార్తి (Karthi) సినిమాలో ముఖ్యపాత్రలో నటించిన లైలా(Laila) తాజాగా దళపతి విజయ్ సినిమాలో కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఒకవేళ నిజంగానే లైలా విజయ్ సినిమాలో నటిస్తే గనుక మళ్ళీ ఆమెకు తమిళంలో వరుస అవకాశాలు రావడం ఖాయం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ది గ్రేటెస్ట్ఆఫ్ ఆల్ టైం మూవీ లో ప్రభుదేవా(Prabhu Deva) ,ప్రేమ్ జీ,వైభవ్,ప్రశాంత్ వంటివాళ్లు కూడానటిస్తున్నారట

Tags:
Next Story
Share it