Hero: పదేళ్లయిన రిలీజ్ కానీ స్టార్ హీరో మూవీ..?

మొదటి సినిమాతోనే టాలీవుడ్లో తనపై అంచనాలు పెంచేశారు. ఎలాంటి గుర్తింపు లేని హీరో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో చాలామంది దర్శకనిర్మాతలు ఈయనతో సినిమా తీయడానికి

Hero: పదేళ్లయిన రిలీజ్ కానీ స్టార్ హీరో మూవీ..?
X

న్యూస్ లైన్ డెస్క్: మొదటి సినిమాతోనే టాలీవుడ్లో తనపై అంచనాలు పెంచేశారు. ఎలాంటి గుర్తింపు లేని హీరో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో చాలామంది దర్శకనిర్మాతలు ఈయనతో సినిమా తీయడానికి క్యూ కట్టేవారు.ఇక ఆ తర్వాత విడుదలైన రెండు, మూడు సినిమాలు భారీ విజయం అందుకున్నాయి.దాంతో ఈ హీరో పేరు టాలీవుడ్ లో ఒక్కసారిగా మార్మోగిపోయింది.

కానీ ఆ స్టార్డం ఎన్ని రోజులో నిలవలేదు.ఈయన చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో మనస్థాపానికి గురైన హీరో డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకొని మరణించారు.ఇక ఆ హీరో ఎవరో ఇప్పటికే మీరు గుర్తుపట్టి ఉంటారు. ఆయన ఎవరో కాదు టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ని సంపాదించిన దివంగత నటుడు ఉదయ్ కిరణ్(Uday kiran) .. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు ఒక సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా ఈయన చనిపోయి పది సంవత్సరాలైనా కూడా ఇంకా విడుదల కి నోచుకోలేదు. ఇక సినిమా ఏంటంటే.. చిత్రం చెప్పిన కథ(Chitram cheppina katha) .. నువ్వు నేను హీరోయిన్ అనిత(Anitha0 , మాదాలస,డింపుల్, గరిమ వంటి హీరోయిన్స్ ఇందులో ఉదయ్ కిరణ్ సరసన జతకట్టారు. అలాగే ఈ సినిమాకి నిర్మాతగా సిహెచ్ మున్నా, డైరెక్టర్గా మోహన్ ఏఎల్ఆర్ కే (Mohan ALRK) ఉన్నారు.


అయితే ఈ సినిమా లో ఉదయ్ కిరణ్ (Uday kiran) ని ఇప్పటివరకు చూడని విధంగా చూస్తారని, ఈయన అభిమానులకు ఈ సినిమా ఒక మంచి కానుక లాంటిది అని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తెలిపారు.కానీ ఈ సినిమా ఉదయ్ కిరణ్ మరణించాక 10 ఏళ్లయిన కూడా విడుదలకు నోచుకోవడం లేదు.అయితే ఈ సినిమా గురించి డైరెక్టర్ గతంలో ఎన్నో విషయాలు చెప్పారు. కానీ చివరికి ఈ మూవీ రిలీజ్ కి నోచుకోవడం లేదు.అయితే ఉదయ్ కిరణ్ మరణించాక అప్పుడప్పుడు ఈ సినిమా విడుదల తేదీ గురించి టాక్ వినిపించినప్పటికీ ప్రస్తుతం అయితే ఆ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయారు.అయితే ఉదయ్ కిరణ్ అభిమానులు మాత్రం ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని కోరుకుంటున్నారు

Tags:
Next Story
Share it