Sudher Babu: ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాలివే!

అదృష్టం స్క్రీన్ మీద చూసుకుంటూనే ఉంటాడు.14వ తేదీన థియేటర్లలో దిగిపోతున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Sudher Babu: ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న  సినిమాలివే!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వారం వారం కొత్త సినిమా రావాల్సిందే.. ప్రతివారం ప్రతి హీరో ..అదృష్టం స్క్రీన్ మీద చూసుకుంటూనే ఉంటాడు.14వ తేదీన థియేటర్లలో దిగిపోతున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఐదు సినిమాలు ఈ బరిలోకి దిగుతున్నాయి. ఆ జాబితాలో కాస్త బజ్ ఎక్కువగా ఉన్న సినిమాల లిస్ట్ చూద్దాం.

* 'హరోం హర'( HAROM HARA) కనిపిస్తోంది. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి జ్ఞానసాగర్ దర్శకత్వం వహించాడు. మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది.

*'యేవం' చాందినీ చౌదరి( CHANDINI CHOWDARY) ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ప్రకాశ్ దంతులూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి నవదీప్ కూడా కో ప్రొడ్యూసర్ గా పనిచేశారు.

* అజయ్ ఘోష్ ప్రధాన పాత్రధారిగా 'మ్యూజిక్ షాప్ మూర్తి'( MUSIC SHOP MURTHI) సినిమాలు థియేటర్లకు రానున్నాయి. ఈ సినిమా పై కూడా అంచనాలున్నాయి. కామెడీ జోనర్ లో జనాలు ఆదరిస్తారనే అంటున్నారు.

* 'మహారాజ'( MAHARAJA) . విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ .. అభిరామి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

ఈ వారం ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.

Tags:
Next Story
Share it