Mamatha Benarji : హెలికాప్టర్ లో జారిపడిపోయిన మమతా బెనర్జీ!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ఎన్నికల ప్రచారం లో భాగంగా దుర్గాపూర్ లో ప్రచార సభలను నిర్వహించుకొని తిరిగి వెళ్తూ హెలికాప్టర్ లో ఎక్కినా తర్వాత సీటులోకి కూర్చోడానికి ప్రయత్నిస్తున్న సమయం లో జారీ పడిపోయారు.

Mamatha Benarji : హెలికాప్టర్ లో జారిపడిపోయిన మమతా బెనర్జీ!
X

న్యూస్ లైన్, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ఎన్నికల ప్రచారం లో భాగంగా దుర్గాపూర్ లో ప్రచార సభలను నిర్వహించుకొని తిరిగి వెళ్తూ హెలికాప్టర్ లో ఎక్కినా తర్వాత సీటులోకి కూర్చోడానికి ప్రయత్నిస్తున్న సమయం లో జారీ పడిపోయారు. దీంతో ఆమెకి చిన్న గాయం అయ్యినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆమె అదే హెలికాప్టర్ లో అసన్సోల్‌కు ప్రయాణం సాగించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. గతం లో కూడా మమతా బెనర్జీ కి పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. కారు యాక్సిడెంట్ లో ఆమె ముఖానికి ఏ స్థాయిలో గాయం అయ్యిందో మనమంతా చూసాము. ఇలా వరుసగా ఆమెకి ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భయపడుతున్నారు. ఆమెని జాగ్రత్తగా ఉండాల్సిందిగా సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి పోస్టులు వేస్తున్నారు. ముఖ్యంగా ఆమె భద్రతా సిబ్బందిని కూడా ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Tags:
Next Story
Share it