Adhir Ranjan Chowdhury: టీఎంసీకి కంటే బీజేపీకి ఓటేయడమే మేలన్న కాంగ్రెస్ కీలక నేత

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, బహరంపూర్ లోక్‌సభ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

Adhir Ranjan Chowdhury:  టీఎంసీకి కంటే బీజేపీకి ఓటేయడమే మేలన్న కాంగ్రెస్ కీలక నేత
X

Adhir Ranjan Chowdhury: పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, బహరంపూర్ లోక్‌సభ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు గెలవకపోతే భారతదేశ సెక్యులరిజం దెబ్బతింటుంది. జంగీపూర్ లోక్‌సభ స్థానంలో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ముర్తుజా హుస్సేన్‌కు మద్దతుగా లాల్‌గోలా ఎన్నికల సభలో అధీర్ చౌదరి మాట్లాడుతూ తృణమూల్‌కు ఓటు వేయకుండా బీజేపీకి ఓటేయడం మంచిదని అన్నారు. తృణమూల్‌కు ఓటేయడం కంటే బీజేపీకి ఓటేయడమే మేలు. అందుకే తృణమూల్‌కి కాదు, బీజేపీకి కాదు, బోకుల్ (ముర్తుజా హుస్సేన్) ఎప్పుడూ సుఖ దుఃఖంలో మీ వెంటే ఉంటారనే నమ్మకం నాకుంది. కాబట్టి బోకుల్‌కు ఓటు వేయండన్నారు. బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా అధిర్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. టీఎంసీ వేసే ప్రతీ ఓటు హాని కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీకి తకూడా తెలుసని అన్నారు. అయితే అధిర్ రంజన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. తాను ఇంకా ఈ వీడియో చూడలేదని అన్నారు.

మమతా బెనర్జీ, అధిర్ రంజన్ చౌదరి రాజకీయంగా ఒకరికొకరు గట్టి ప్రత్యర్థులు. మమతా బెనర్జీపై అధీర్ రంజన్ చౌదరి దాడి చేస్తూనే ఉన్నారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ కార్యకర్తలను నిరంతరం హింసిస్తున్నారని అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ , కాంగ్రెస్ విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్ వామపక్షాలకు 12 సీట్లు వదిలిపెట్టింది. ఈ 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టలేదు. అదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో బీజేపీ, టీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు పరస్పరం సహాయం చేసుకుంటున్నాయని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అధీర్ రంజన్ చౌదరి ప్రకటన కారణంగా ప్రశ్నలు తలెత్తాయి. దీనికి సంబంధించి రాజకీయాలు వేడెక్కాయి.

Tags:
Next Story
Share it