AP: పోలీసుల కస్టడీకి జగన్‌పై రాయిదాడి కేసు నిందితుడు

విచారణ అనంతరం.. సతీష్‌కు మూడు రోజుల కస్టడీ విధించేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

AP: పోలీసుల కస్టడీకి జగన్‌పై రాయిదాడి కేసు నిందితుడు
X

న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jaganmohan reddy)పై రాయి దాడి జరిగింది. విజయవాడ(Vijayawada)లోని అజిత్‌సింగ్ నగర్‌లో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జగన్ ప్రసంగిస్తుండగా కరెంట్ పోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆయనపై రాయి దాడి జరిగింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటిపై భాగంలో గాయమైంది. వందల మంది జనం ఉండగా.. ఏకంగా రాష్ట్ర సీఎంపైనే రాయి దాడి జరగడం రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాఫుటేజీ సహాయంతో ఆధారాలు సేకరించారు.

అయితే, రాయిదాడి కేసులో సతీష్‌ అనే మైనర్‌ను నిందితుడిగా పరిగణించారు. విచారణ అనంతరం.. సతీష్‌(Sathish)కు మూడు రోజుల కస్టడీ విధించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. అడ్వకేట్‌ సమక్షంలోనే పోలీసుల విచారణ జరగాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సతీష్ఏ 1గా ఉన్నాడు. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Tags:
Next Story
Share it