Politics: వెంకట్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక జోకర్, ఒక తాగుబోతు అంటూ తిట్ల దండకం అందుకున్నారు.

Politics: వెంకట్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat reddy)పై BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రెడ్డికి మంత్రి పదవి వచ్చాక కండకావరం పెరిగిందని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక జోకర్, ఒక తాగుబోతు అంటూ తిట్ల దండకం అందుకున్నారు. తెలంగాణ మంత్రి వర్గంలోనే సబ్జెక్ట్(Subject) లేని ఒక సన్నాసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వెంకట్ రెడ్డి మంత్రి లాగా కాకుండా.. ఒక మూర్ఖుడి లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్న ఎమ్మెల్యే హరీష్ రావు(Harish rao)ను విమర్శించిన తీరు చూస్తే.. వెంకట్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదనిపిస్తోందని మండిపడ్డారు. మద్యం తాగి ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావును దూషించారని ఆరోపించారు. హవాలా దందాలు కూడా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికే సాధ్యమవుతాయని కౌశిక్ రెడ్డి విమర్శించారు.


Tags:
Next Story
Share it